Homeవ్యాపారంఅమెజాన్ సెల్లర్లకు అదిరిపోయే కానుక

అమెజాన్ సెల్లర్లకు అదిరిపోయే కానుక

- Advertisement -

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉన్న లక్షల సంఖ్యలో ఉన్న విక్రేతల వ్యాపార వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో అమెజాన్ ఇండియా ఫీజుల తగ్గింపుపై ఈ రోజు ఒక చారిత్రాత్మక ప్రకటన చేసింది. గత ఏడాది చేపట్టిన ఫీజు సవరణను మరింత విస్తరిస్తూ, 2025లో కేవలం 1.2 కోట్ల ఉత్పత్తులకు మాత్రమే ఉన్న జీరో రిఫరల్ ఫీజు సౌకర్యాన్ని ఇప్ప్పుడు 10 రెట్లు పెంచి, రూ. 1,000 లోపు ధర కలిగిన 12.5 కోట్ల ఉత్పత్తులకు వర్తింపజేస్తోంది. ఈ వెసులుబాటు సుమారు 1, 800 కంటే bక్కువ కేటగిరీలలో అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, రూ. 300 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై ఈజీ షిప్ ఫీజును 20 శాతం కంటే ఎక్కువ తగ్గించింది. ఈ ఈజీ షిప్ పద్ధతి ద్వారా విక్రేతలు తమ వస్తువులను సొంత ప్రాంగణాల్లోనే ఉంచవచ్చు. మరియు అమెజాన్ సంస్థే వాటి పికప్, డెలివరీ బాధ్యతలను చూసుకుంటుంది. తక్కువ రవాణా ఖర్చులతో ఇ`కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించే వారికి లేదా విస్తరించే వారికి ఇది ఒక ఉత్తమ ఎంపిక నిలుస్తుంది. అలాగే, ఒకే బాక్సులో ఒకటి కంటే ఎక్కువ వస్తువులను పంపే విక్రేతలు రెండవ వస్తువుపై విక్రయ రుసుముల్లో 90 శాతం కంటే bక్కువ ఆదా చేసుకోవచ్చు, ఇది వారి మొత్తం లాభాలను పెంచుతుంది. ఈ సవరించిన కొత్త ఫీజులు మార్చి 16, 2026 నుండి అమలులోకి రానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు