Homeజిల్లాలుఅనంతపురంజేఎన్టీయూ ఏ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసిన డిఆర్డిఓ సైంటిస్ట్ సతీష్ రెడ్డి

జేఎన్టీయూ ఏ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసిన డిఆర్డిఓ సైంటిస్ట్ సతీష్ రెడ్డి

DRDO scientist Satheesh Reddy released the JNTU-A email stamp.

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:
జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల 80 సంవత్సరాలు మహోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టల్ స్టాంప్ ను ఎన్టీఆర్ ఆడిటోరియంలో శనివారం విడుదల చేసిన డిఆర్డిఓ సైంటిస్ట్ సతీష్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోవీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి చెన్నారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం సైంటిస్ట్ మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప కళాశాలగా.. ఆవిర్భవించి.. ప్రపంచ దేశాలకు యువ ఇంజనీర్లను అందించిన మహోన్నత కళాశాల అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్ల అనంతపురం, సత్యసాయి జిల్లాలలో పారిశ్రామిక, డిఫెన్స్, ఆటోమొబైల్, సోలార్ విభిన్న కంపెనీలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులను విశ్వవిద్యాలయం సద్వినియోగం చేసుకుని.. మహోన్నత ఆవిష్కరణలకు వేదికగా నిలచాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వీసీ మాట్లాడుతూ..80 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యమైన సాంకేతిక విద్యను సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెచ్చిన ఘనత అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ దక్కుతుంది అన్నాడు. యువ ఇంజనీర్ల ఉజ్వల భవితకు.. నిరంతరం సాధన, ప్రణాళిక కార్యచరణ అమలు సంసిద్ధంగా విశ్వవిద్యాలయం ఉద్యోగులు ఉంటారన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు కళాశాల అభ్యున్నతలో తొలి పాత్ర అన్నారు.పూర్వ విద్యార్థులు, మేధావులు సహకారంతో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, పూర్వ విద్యార్థులు, పారిశ్రామిక వ్యక్తులు, పోస్టల్ శాఖ సూపరిండెంట్ కె. అమర్నాథ్, వాయిస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్,అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

01..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు