Thursday, January 15, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికా ఒత్తిళ్లకు తలొగ్గబోం: పుతిన్‌

అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గబోం: పుతిన్‌

- Advertisement -

మాస్కో: అమెరికా లేక మరే దేశం తమపై ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చినా రష్యా తలొగ్గదని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చి చెప్పారు. తమ దేశంపై సైనిక చర్యలు, దాడులకు ఉపకరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. రష్యాలోని రెండు పెద్ద చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించడంపై పుతిన్‌ స్పందించారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఆంక్షల విధించడం అన్నది స్నేహపూర్వక చర్య ఎంతమాత్రం కాదని ఆయన విలేకరులతో అన్నారు. ఈ చర్యలకు పర్యవసానాలు ఉంటాయని, తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని తెలిపారు. రష్యా చమురు రంగం ఢీలాపడబోదన్నారు. ఆత్మాభిమానమున్న దేశం, దేశ ప్రజలు ఒత్తిళ్లకు తలొగ్గరని పుతిన్‌ అన్నారు. ట్రంప్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రష్యాపై ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారు దేశంగా ఉన్న రష్యా నుంచి ఎగుమతులకు విఘాతం కలిగిస్తే చమురు ధరలపై అమెరికా గ్యాస్‌ స్టేషన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. రాజకీయంగానూ వాషింగ్టన్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుందన్నారు. రష్యాకు ఆర్థిక నష్టం పరిమితమని, శాంతి ఒప్పందం దిశగా క్రెమ్లిన్‌ ప్రయత్నం వేళ ఆర్థికపరంగా ఒత్తిడి తెచ్చేలా కొత్త ఆంక్షలతో ట్రంప్‌ ఎలాంటి సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ ఆపుతుందో లేదో స్పష్టత లేదన్నారు. పుతిన్‌తో సమావేశాన్ని ట్రంప్‌ బుధవారం రద్దు చేసుకున్నారు. అయితే ఈ సమావేశానికి బుడాపెస్ట్‌ వేదికను ట్రంప్‌ ప్రతిపాదించారని పుతిన్‌ తెలిపారు. ఎప్పుడైనాసరే ఏ విషయంలోనూ ఘర్షణలుయుద్ధాల కంటే సంప్రదింపులు, చర్చలే మేలని పుతిన్‌ సూచించారు. భారీగా పెరిగిన సూపర్‌ ట్యాంకర్ల చార్జీలు రష్యా ప్రధాన చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలతో చమురు రవాణా చేసే సూపర్‌ ట్యాంకర్ల చార్జీలు అమాంతం పెరిగాయి. పశ్చిమాసియాచైనా మార్గంలో చార్జీ ఒక్కరోజే 16 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడిరది. డిసెంబరు కాంట్రాక్టులకు సంబంధించిన చార్జీలు 13 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. రష్యా కంపెనీలు, వాటికి అనుబంధ కంపెనీలపైనా అమెరికా ఆంక్షలకు తోడు ఈయూ ఆర్థిక ఆంక్షలు విధించింది. నవంబరు 21 నుంచి ఆంక్షలన్నీ అమలవుతాయి. రష్యా ఆగస్టులో నిత్యం 7.3 మిలియన్‌ బ్యారెళ్ల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్లు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ డేటా చెబుతోంది. ప్రపంచ ముడిచమురు, రిఫైన్డ్‌ ఇంధన వినియోగంలో ఇది ఏడు శాతానికి సమానమని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు