వాషింగ్టన్: రష్యాపై ఆంక్షలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సమర్థించుకున్నారు. ఆంక్షల విధింపు స్నేహపూర్వక చర్య కాదని రష్యా భావించడం సంతోషకరమేనని అన్నారు. ఈ ఆంక్షల తీవ్రత గురించి రష్యాకు మరో ఆరు నెలల్లో తెలుస్తుందని, అప్పుడు ఏం చేస్తుందో చూద్దామని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. విదేశీ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని పుతిన్ తేల్చిచెప్పిన ప్రకమంలో ట్రంప్ స్పందించారు. ట్రంప్ చర్యలను శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ సమర్థించారు. పుతిన్‌తో సమావేశంపై స్పష్టత లేదన్నారు. తన సమయం సద్వినియోగమే ట్రంప్ కోరుకుంటారని, పుతిన్‌తో భేటీ కోసం సానుకూల పరిస్థితులను అమెరికా కోరుకుంటోందని లీవిట్ వెల్లడిరచారు.
కెనడాతో వాణిజ్య చర్చలకు బ్రేక్
కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా సుంకాలకు సంబంధించి ఆ దేశం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో ప్రసారమైన ఓ టీవీ ప్రకటనపై మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. అమెరికా కోర్టు తీర్పులను ప్రభావితం చేసేదిగా ఆ ప్రకటన ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా వెలుపల తమ దేశ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యమని కెనడా ప్రధాని మార్క్ కార్నే ప్రకటన చేశాక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందించారు. ‘దేశ భద్రత, ఆర్థికవ్యవస్థ కోసం సుంకాలు కీలకం. అమెరికా విషయంలో దుర్మార్గంగా వ్యవహరించినందుకు కెనడాతో ఇకపై ఎటువంటి వాణిజ్యపరమైన చర్చలు జరగబోవు’ అని ట్రంప్ తెలిపారు.
పుతిన్ ఏం చేస్తారో చూద్దాం: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


