Homeఅయ్యో…మామిడి రైతు

అయ్యో…మామిడి రైతు

- Advertisement -

. నాలుగు టన్నుల ధర రూ.1,000
. చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థిత

విశాలాంధ్ర-చిత్తూరు : రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే రాలిపోతుంటే… కన్నీటిపర్యం తమవుతున్న ఆ రైతును ఆదుకోవా ల్సిన వ్యవస్థే వంచించింది. చిత్తూ రు జిల్లా మామిడి రైతు పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. అకాల వర్షం ఒకవైపు దెబ్బకొడితే, మార్కెట్‌లో వ్యాపారులు కనికరం లేని ధోరణితో రైతు కడుపు కొడుతున్నారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వీచిన భారీ గాలులకు ఐరాల, తవణం పల్లి, పూతలపట్టు, పెనుమూరు, పలమనేరు సహా అనేక మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతు ఆశలను అడియాసలు చేసింది. తీరా నేల రాలిన కాయలనైనా అమ్ముకుని అప్ప్పులు తీర్చుకుందామని ఆశపడ్డ రైతుకు మార్కెట్‌లో చేదు అనుభవం ఎదురయింది. మంగళవారం ఐరాల మండలం పొలకల సంత గేటు వద్ద కనిపించిన దృశ్యాలు రైతు దుస్థితికి అద్దం పట్టాయి. రైతులు ట్రాక్టర్ల కొద్దీ మామిడిని మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపా రులు ఏకంగా నాలుగు టన్నుల (ఒక ట్రాక్టర్) మామిడికి కేవలం రూ.1,000 మాత్రమే ఇస్తామని తెగేసి చెప్పారు. కనీసం కిలోకు రెండు రూపాయిలు అయినా ఇవ్వమని రైతులు కాళ్లవేళ్ల పడి వేడుకున్నా వ్యాపారులు కని కరించలేదు. ట్రాక్టరు అద్దె, కూలీల ఖర్చు కూడా రాని ఈ ధరకు పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలు ఏటా పునరావృతమవుతూనే ఉన్నాయి. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ, మార్కెట్‌లో సిండికేట్లను అడ్డుకోవ డంలోనూ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. కోట్లు గడిస్తున్న జ్యూస్ ఫ్యాక్టరీలు, దళారుల మధ్య నలిగిపోతున్న రైతుకు కనీస మద్దతు ధర ఎప్ప్పుడు లభిస్తుంది? ప్రతి అకాల వర్షానికీ రైతే బలి కావాలా? తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలి. మద్దతు ధరను నిర్ణయించి, రైతుల కన్నీళ్లు తుడిచే దిశగా చర్యలు చేపట్టాలి. అక్రమంగా సిండికేట్ అవుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు