Sunday, November 16, 2025
Homeసంపాదకీయంఆ విధానమే సరిలేదు!

ఆ విధానమే సరిలేదు!

- Advertisement -

భారతదేశంలో ప్రభుత్వ వ్యవసాయ విధానం అస్తవ్యవస్తంగా ఉందని చెప్పడానికి jూరియా కొరత ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు పన్నో రాష్ట్రాల్లో ప్రస్తుతం jూరియా కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఏపీలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అవసరానికి సరిపడా jూరియా దొరక్కపోగా, బ్లాక్‌మార్కెట్‌ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఒక డిపోలో 1500 మంది రైతులు jూరియా కోసం క్యూలో నిల్చొనగా, కేవలం 350 మందికి మాత్రమే jూరియా కట్టలిచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. jూరియా అవసరాలు వ్యవసాయ సీజన్‌ (ఖరీఫ్‌/రబీ), సాగు విస్తీర్ణం, వర్షపాతం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయనేది త్రోసిపుచ్చలేం. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు jూరియా చాలా అవసరం. రాష్ట్రంలో సుమారు 40% jూరియా కొరత ఉందని వ్యవసాయ అధికారులే చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా jూరియాను కేటాయిస్తున్నట్లు ఈ మధ్యనే ప్రకటించింది. 24,894 మెట్రిక్‌ టన్నుల jూరియాను రాష్ట్రానికి కేటాయించారు. ఇది విశాఖపట్నం పోర్టుకు చేరినట్లు ధృవీకరించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం, రాష్ట్రంలో సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద 82,054 మెట్రిక్‌ టన్నుల jూరియా నిల్వలు ఉన్నాయి. అదనంగా, వివిధ పోర్టులు, తయారీ కంపెనీల నుంచి మరో 29,236 మెట్రిక్‌ టన్నులు రవాణాలో ఉన్నాయి. మొత్తం మీద, సెప్టెంబర్‌ చివరి నాటికి 1,06,412 మెట్రిక్‌ టన్నుల jూరియా రాష్ట్రానికి చేరవచ్చని అంచనా. జిల్లా స్థాయి అవసరాలు మారుతూ వస్తున్నాయి. ఉదాహరణకు, గుంటూరు జిల్లాకు అవసరమైన 24,000 మెట్రిక్‌ టన్నులకు బదులుగా 26,000 మెట్రిక్‌ టన్నుల jూరియా సరఫరా అయింది. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో jూరియా కొట్టుకుపోయిందన్న వాదనలో పసలేదు. ప్రభుత్వం పరువుల సరఫరాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ, అధికారుల వాస్తవ పనితీరు ఆ స్థాయిలో కనపడటం లేదు. ఇవన్నీ ఒకెత్తయితే, jూరియా అధిక వినియోగాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు jూరియా వినియోగాన్ని తగ్గించిన రైతులకు రూ.800 ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాల గొడవ వచ్చే సీజన్‌కు సంబంధించినది. సీపం ప్రకటన ఇప్పటికిప్పుడు రైతన్న పదుర్కొంటున్న కొరతను తీర్చలేదు.
jూరియా వాడకం వల్ల నష్టాలున్నాయని తెలియనిదికాదు. ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వ వైఫల్యం కాదనలేని సత్యం. jూరియా అధికంగా వాడటం వల్ల నేలలోని నత్రజని శాతం పెరుగుతుంది. ఇది నేలలోని సారం విలువను మార్చి, నేలను కలుషితం చేస్తుంది. నేలలోని అదనపు jూరియా వర్షపు నీటితో కలిసి నదులు, చెరువులు, భూగర్భ జలాల్లోకి చేరుతుంది. దీనివల్ల నీటిలో విషపూరిత లవణాలు విపరీతంగా పెరిగి, చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. jూరియాలోని నైట్రోజన్‌ వాతావరణంలోకి అమ్మోనియా వాయువుగా విడుదలవుతుంది. ఇది గాలి కాలుష్యానికి కారణమవుతుంది. పంట మొక్కలు ఆకులు, కాండం పక్కువగా పెరిగి, పూత, కాత సరిగా రాక… పంట దిగుబడితో పాటు, నాణ్యత కూడా తగ్గుతుంది. jూరియాలోని రసాయనాలు నేలను సహజసిద్ధంగా సారవంతం చేసే సూక్ష్మజీవులను, వానపాములను నాశనం చేస్తాయి. jూరియా అధికంగా వాడిన పంటలను తినడం వల్ల మనుషుల్లో నైట్రేట్‌ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ నష్టాలను తగ్గించడానికి, రైతులు jూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ పరువులు, జీవ పరువులు, సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులను పాటించడం మంచిది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఈ సూచనలన్నీ ప్రస్తుత ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు సాధ్యమయ్యే పనేనా?
దేశంలో jూరియా కొరతకు ప్రధాన కారణం…ఈ రసాయనాన్ని ఇతర అవసరాలకు విచ్ఛలవిడిగా వాడుతుండటమే. పారిశ్రామిక ఉపయోగార్థం jూరియాను ప్లాస్టిక్‌, అడ్హెసివ్స్‌ (జిగురు), ఫార్మాల్డిహైడ్‌ రెసిన్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఫర్నిచర్‌, ప్యానెల్స్‌, ఇతర నిర్మాణ సామగ్రిలో వాడతారు. డీజిల్‌ వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి jూరియాను డీజిల్‌ పగ్సాస్ట్‌ ఫ్లూయిడ్‌గా ఉపయోగిస్తారు. ఇది నైట్రోజన్‌ ఆక్సైడ్లను ప్రమాదకరం కాని నత్రజని, నీరుగా మారుస్తుంది. పేపర్‌ పరిశ్రమలో కొన్ని రకాల పేపర్లను తయారు చేయడానికి jూరియాను వాడతారు. వైద్య, సౌందర్య సాధనాల ఉపయోగార్థం jూరియాను కొన్ని రకాల చర్మ సంరక్షణ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లలో ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని రకాల మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. విమానాశ్రయాలలో రన్‌వేల మీద పేరుకుపోయిన మంచును తొలగించడానికి డిఐసింగ్‌ ఏజెంట్‌గా jూరియాను వాడుతారు. అలాగే, పశువులకు ఇచ్చే దాణాలో ప్రోటీన్‌ శాతాన్ని పెంచడానికి తక్కువ మొత్తంలో jూరియాను కలుపుతారు. ఇన్ని రకాల అవసరాల నేపథ్యంలో jూరియా కొరత సహజమేనని అనలేం. ఇవన్నీ తెలిసిన ప్రభుత్వం ఏం చేస్తోంది? నత్రజని అవసరం లేకుండా పంటలను పండిరచడం సాధ్యమా? జీవన పరువులైన రైజోబియం, అజటోబాక్టర్‌, అజస్పైరిల్లమ్‌, నీటి ఆకుపచ్చ నాచు వంటి వాటిని వినియోగించడం ద్వారా భూమి సహజ స్వభావం దెబ్బతినకుండా నత్రజని శాతాన్ని పెంచవచ్చు. వీటి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలూ ఉంటాయి. వాటి సరఫరాకు, లేదా స్థానికంగానే వాటి తయారీకి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నది? పరువుల సబ్సిడీని తగ్గించేందుకు 2013 జూన్‌లో మోదీ సర్కారు ‘పీిపంప్రణామ్‌’ పేరుతో ఒక పథకాన్ని తీసుకువచ్చింది. పరువుల సబ్సిడీని రూ.20 వేల కోట్లు తగ్గించుకోవాలన్నది కేంద్ర లక్ష్యం. వూడేళ్లపాటు అమలులో ఉండే ఈ పథకం కింద గ్రాంట్‌ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ గ్రాంట్‌లో కొంత మొత్తాన్నయినా రైతుల ఖాతాల్లోకి జమచేస్తే ప్రస్తుత ఆందోళన తగ్గుతుందని ప్రభుత్వం భావించవచ్చు. కానీ దానిక్కూడా విధివిధానాలేవీ లేవు. ఈక్రాప్‌ అనేది ఒక ఫార్సుగా మారింది. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా ఈక్రాప్‌ అనుసంధానమవుతుందని చెపుతున్నా, పంటలు వేసిన తర్వాత అవి నమోదవుతున్నాయి. అలాంటప్పుడు ఈ`క్రాప్‌కు ప్రాతిపదిక ఏముంటుంది? పైగా లక్షల మంది కౌలురైతులు రాష్ట్రంలో ఉన్నారు. చంద్రబాబు చెపుతున్న నగదు ప్రోత్సాహకం వారికి అందుతుందా? jూరియాను తగ్గిస్తే రూ.800 ఇస్తామన్నప్పుడు, డీఏపీ, పంఓపీ, పస్‌పస్‌పీ, పన్‌పీకే (కాంప్లెక్స్‌) వంటి ఇతర పరువుల వాడకం తగ్గింపుపై ప్రోత్సాహకాలుండవా? ఇదంతా చూస్తే, jూరియా కొరతను తీర్చకుండా సర్కారు వేసే కప్పదాటు వ్యవహారంలా గోచరిస్తోంది. ఏదేమైనప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలే అసమంజసంగా ఉన్నాయనేది విస్పష్టం. వాడకాలు, ప్రోత్సాహకాల సంగతి పక్కనబెట్టి, ఈ ఏడాది పరువుల కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు