Homeజాతీయంఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

- Advertisement -

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. డిసెంబర్ 23న త్రిపురతో మూడో దశ ఎసఐఆర్ ప్రక్రియ ముగియనుంది. ఎసఐఆర్‌కు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. ఏపీలో జూన్ 5 నుంచి 14 వరకు ఎసఐఆర్ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అదే నెల 15 నుంచి జులై 14 వరకు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి… అదే రోజు నుంచి సెప్టెబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు