Wednesday, June 18, 2025
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కే మా మద్దతు: జీ7 కూటమి

ఇజ్రాయిల్‌కే మా మద్దతు: జీ7 కూటమి

కననాస్కిస్‌: ఇజ్రాయిల్‌కే తమ మద్దతు ఉంటుందని జీ7 దేశాల కూటమి ప్రకటించింది. ఇజ్రాయిల్‌ భద్రత కోసం తాము అండగా నిలుస్తామని వెల్లడిరచింది. ఇరాన్‌ ఉగ్రవాద శక్తులను పెంచిపోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని జీ7 కూటమి ఆరోపించింది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని తేల్చి చెప్పింది. కెనడాలోని కననాస్కిస్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి ఈమేరకు ఒక ప్రకటనను జీ7 దేశాలు విడుదల చేశాయి. ఇరాన్‌ వద్ద అసలు అణ్వాయుధాలు ఉండకూడదనే తమ వాదనను జీ7 కూటమి పునరుద్ఘాటించింది. ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరగాలని పేర్కొంది. లేదంటే ప్రాణ నష్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోనూ కాల్పుల విరమణ జరగాల్సిన అవసరం ఉందని జీ7 కూటమి తెలిపింది. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రతికూల ప్రభావం ఇంధన మార్కెట్లపై పడకుండా చూసేందుకు భావ సారూప్య భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని జీ7 దేశాలు ప్రకటించాయి. ఇంధన మార్కెట్ల స్థిరత్వం చెదరకుండా కాపాడేందుకు తమవంతుగా సహకరిస్తామని వెల్లడిరచాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు