విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ సేవలు మరువలేనివని ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సహాయ కార్యదర్శి ఈరన్న, మండల అధ్యక్షులు సోమన్న, ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక రైతు భరోసా కేంద్రంలో బదిలీపై వెళుతున్న వ్యవసాయ అధికారి వరప్రసాద్ ను ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ తరుపున శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణ, లింగమూర్తి, ఏలియస్, రాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.