Homeజిల్లాలుకర్నూలుబంద్ విజయవంతం

బంద్ విజయవంతం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చేయాలంటూ దేశవ్యాప్త బంద్ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శ పాఠశాల, రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల, వెంకటసాయి ప్రాథమికోన్నత పాఠశాల స్వచ్ఛందంగా మూయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 20న ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు విద్యార్థి, యువతపై అత్యంత అమానుషంగా లాఠీఛార్జి , టియర్ గ్యాస్ ఉపయోగించి వేలాది మంది విద్యార్థులను గాయపర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయాలని, విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని, నీట్ పరీక్షా విధానం రద్దు చేసి రాష్ట్రాల వారిగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు హుస్సేన్ పటేల్, మేకడోణ గ్రామ కార్యదర్శి దీదార్ అహ్మద్, చిన్నతుంబళం గ్రామ అధ్యక్షులు, కార్యదర్శి కందనాతి లింగనాయుడు, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు