Homeజిల్లాలుఅనంతపురంభూ ఆక్రమణకు నిరసనగా 30న ఉరవకొండలో వైసీపీ ఆందోళన

భూ ఆక్రమణకు నిరసనగా 30న ఉరవకొండలో వైసీపీ ఆందోళన

- Advertisement -

విశాలాంధ్ర – ఉరవకొండ: కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కౌడికి గోవిందు అల్లుడు పి. విజయ్‌కుమార్‌కు చెందిన 21.05 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారని ఆరోపిస్తూ, ఆ భూమిని యజమానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఉరవకొండలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు.

శుక్రవారం ఉరవకొండలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు డి. సురేష్ అధ్యక్షతన నిర్వహించిన బీసీ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విడపనకల్లు మండలం వేలపుమడుగు గ్రామంలోని సర్వే నంబర్ 141లో ఉన్న 21.05 ఎకరాల భూమిని పి. విజయ్‌కుమార్ 2023లో చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకుల అండతో కొందరు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించి, యజమాని తన సొంత భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ భూమిపై పి. విజయ్‌కుమార్‌కే పూర్తి హక్కులు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ, రెవెన్యూ మరియు పోలీసు అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.పొలంలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బోర్లు, పైపులను ధ్వంసం చేశారని, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భూమిని వెంటనే యజమానికి స్వాధీనం చేసి అప్పగించాలని, ఆక్రమణకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 30న ఉరవకొండలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, కార్యదర్శి గోవిందు, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సుశీలమ్మ, బీసీ సెల్ నాయకులు వీరన్న, ధనుంజయ, జోగి హనుమంతు, బద్రి, రమేష్, ఈడిగ ప్రసాద్, వడ్డే గంగాధర్, నరేష్, వైసీపీ నాయకులు అశోక్‌కుమార్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు