నీట్ పేపర్ లీక్, సీజేపీ నిరసన నేపథ్యంలో పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీక్‌ల (Paper Leak) ఘటనలో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును క్యాబినెట్ (Union Cabinet) ఆమోదించింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సవరించిన బిల్లు ప్రకారం, ఎవరైనా పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనల్ని చేర్చారు. ఇదే కాకండా పేపర్ లీక్ కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టులు మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవైపు కొత్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతున్న సమయంలోనే మరోవైపు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్రం, సీజేపీ మధ్య చర్యలు ప్రారంభమయ్యాయి. సీజేపీ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనల్లో పాల్గన్న విద్యార్థులపై పెట్టి కేసుల ఉపసంహరణ, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అనే మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. మంత్రి రాజీనామా డిమాండ్‌పై ఒక రోజు సమయం కోరింది. ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని సీజేపీ స్పష్టం చేసింది.


