Homeజాతీయంఇప్పుడు మౌనం వహిస్తే, దేశం ఇంకెప్పటికీ ముందుకు సాగదు: సీజేపీ

ఇప్పుడు మౌనం వహిస్తే, దేశం ఇంకెప్పటికీ ముందుకు సాగదు: సీజేపీ

- Advertisement -

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని అదే తమ ప్రధాన డిమాండ్‌ అని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. గతంలో తమకు ఆందోళనలు చేసిన నేపథ్యం ఏమీ లేదని.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పోరాటం కొనసాగిస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వెల్లడించారు. విద్యా వ్యవస్థ నాశనమైనందుకు దేశంలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. అందుకే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కొందరు వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని.. ఇప్పుడు మౌనం వహిస్తే దేశం ఇంకెప్పటికీ ముందుకెళ్లదని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని.. ప్రజల మద్దతును ఎప్పటికీ మరిచిపోబోమని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. యువత మద్దతుతోనే ఇన్ని రోజులు జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చర్చల కోసం తాము కేంద్రమంత్రి జేపీనడ్డా నివాసానికి వెళ్లబోమని.. జంతర్‌మంతర్‌ వద్దే చర్చలు జరగాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడమే.. ఈ విషయంలో తీసుకునే కఠిన చర్య అని పేర్కొన్నారు. విద్యార్థులపై దిల్లీ పోలీసుల దమనకాండను ఖండించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు