విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆగష్టు 4న పెద్దకడబూరు మండలం కో ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సి. విజయ భారతి తెలిపారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సహకార పరపతి సంఘం ఆవరణంలో రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కో ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో 420 మంది సభ్యులు ఉన్నారన్నారు. జూలై 21న ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. జూలై 27న నామినేషన్, 28న స్క్రూటినీ, 29న నామినేషన్ ఉపసంహరణ ఉంటుందన్నారు. ఆగస్టు 4న పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు. 2 గంటల తర్వాత ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి అప్పుడే ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 7న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు నామినేషన్ ఫీజు 400, బీసీ అభ్యర్థులకు కుల ధృవీకరణ సర్టిఫికెట్ తో 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధృవీకరణ సర్టిఫికెట్ తో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో రుణాలు ఓవర్ డ్యూవ్ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదని, కేవలం ఓటు వేసి హక్కు ఉంటుందని, రైతులకు ఏవైనా అప్పులు ఉంటే ఆగస్టు 3లోపల చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ సబ్ డివిజన్ కో ఆపరేటివ్ అధికారి లక్ష్మికాంత్ రెడ్డి, కెడిసీసీ బ్యాంక్ సూపర్ వైజర్ బాస్కర్, రైతులు పాల్గొన్నారు.
4న కో ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి ఎన్నికలు
- Advertisement -
RELATED ARTICLES


