Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్ర సరిహద్దులో ముమ్మర వాహన తనిఖీలు..

రాష్ట్ర సరిహద్దులో ముమ్మర వాహన తనిఖీలు..

- Advertisement -

విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఎన్‌హెచ్-42 (ఉరవకొండ–బళ్లారి జాతీయ రహదారి) చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులు శనివారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. విడపనకల్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఖాజా హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దు దాటుతున్న లారీలు, ఇతర భారీ వాణిజ్య వాహనాలను నిలిపి వాటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టవ్యతిరేక రవాణా, మద్యం, గంజాయి, ఇతర అక్రమ పదార్థాల తరలింపును అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన అన్ని పత్రాలను వెంట ఉంచుకుని ప్రయాణించాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్ వద్ద నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు