Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసిపిఐ రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులతో ఎరుపెక్కిన లేపాక్షి..

సిపిఐ రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులతో ఎరుపెక్కిన లేపాక్షి..

- Advertisement -

విశాలాంధ్ర – చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సిపిఐ రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతులు పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో ఎరుపెక్కాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కలిసేటిపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో ఎర్రజెండాలు పట్టుకుని లేపాక్షి పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీంతో పట్టణమంతా ఎర్రజెండాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు గుండుమల ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కుళ్లాయప్ప, పుల్లయ్య, తిప్పేస్వామి, ఆంజనేయులు, భాగ్యమ్మ, సంపూర్ణమ్మతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా కళాకారులు ప్రజా చైతన్యాన్ని పెంపొందించే జానపద గేయాలు ఆలపించారు. వారి ప్రదర్శనలు కార్యకర్తలను ఉత్సాహపరిచాయి.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు