లెబనాన్‌పై దాడులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు: ఇరాన్
తెహ్రాన్: పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయిల్‌పై చేపట్టిన తాజా సైనిక చర్యలను ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడితే మాత్రం మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించింది. ఇటీవల బీరుట్ సమీపంలో జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇజ్రాయిల్‌పై దాడి వెనకున్న తమ లక్ష్యాలు నెరవేరాయని, ప్రస్తుత దశలో సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. ఇకపై, లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగితే, తమ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. సోమవారం తెహ్రాన్‌పై ఇజ్రాయిల్ ప్రయోగించిన పలు డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని పేర్కొంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పర దాడులకు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, శాంతి సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు. దాడులు ఆపి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి.
ఇరాన్‌ను తక్షణమే వీడండి…భారతీయులకు సూచన
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ‘ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారులు, యాత్రికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్ప్పుడు గమనించాలి. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలి. అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి’ అని తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి . ఈ నేపథ్యంలో భారతీయులకు రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది.
ఇజ్రాయిల్‌పై దాడుల నిలిపివేత
- Advertisement -


