ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సతీమణి, సోదరి దాదాపు తొమ్మిది నెలల తర్వాత కలిశారు. వారానికి ఒకసారి తన కుటుంబంతో సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్… తన సతీమణి బుష్రా బీబీ, సోదరి నొరీన్ను కలిశారు. ఇమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించడానికి చట్టపరమైన చర్యలు కొసాగుతున్నాయి. తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ తదితర కేసుల్లో శిక్ష పడటంతో ఇమ్రాన్ ఖాన్ కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఒంటరితనం వల్ల ఆయన తీవ్రమైన ఒత్తిడి, మానసిక, శారీరక సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆరోగ్యం క్రమంగా క్ష్మీణిస్తోందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్‌ను చూడడానికి కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో ఆయన పరిస్థితిపై ఆందోళన నెలకొన్న విషయం విదితమే.
సుప్రీం తీర్పును సవాల్ చేస్తాం…
ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ‘చట్టపరిధిలోకి రాదు’ అని పాక్ న్యాయ మంత్రి అజమ్ నజీర్ తరార్ వ్యాఖ్యానించారు. ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సమీక్షా పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుత్రులు ఈ రకమైన చికిత్స అందించలేవని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు సమర్పించినంత వరకు అటువంటి ఏర్పాట్లకు వీలు పడదని తరార్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్‌ను రెండు రోజుల్లోగా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేయబోతున్నట్లు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన భార్య, సోదరి
- Advertisement -
RELATED ARTICLES


