బీజింగ్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధంపై చైనా స్పందించింది. ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి, దాని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు ఇస్తుందని వాంగ్ యి తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్ వెంటనే ఇరాన్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలని, ప్రస్తుత పరిణామాలు మరింత తీవ్రతరం కాకుండా చూడాలని ఆయన సూచించారు.


