అ ఆర్థిక పురోగతిఅణ్వస్త్రాల్లో ప్రగతి అ కిమ్ జాంగ్ ఉన్ సంకల్పం అ అట్టహాసంగా డబ్ల్యూపీకే 80వ వ్యవస్థాపక దినోత్సవం అ హాజరైన చైనా, రష్యా, వియత్నాం అగ్రనేతలు ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ ఎరుపెక్కింది. అధికార కొరియా వర్కర్స్ పార్టీ (డబ్ల్యూపీకే) 80వ వ్యవస్థాపక దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేడే స్టేడియం జనసందోహమైంది. దేశాధ్యక్షుడు, డబ్ల్యూపీకే ప్రధాన కార్యదర్శి కిమ్ జాంగ్ ఉన్ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్నాస్టిక్స్, కళా ప్రదర్శనలు, బాణాసంచా పేలుళ్లతో అట్టహాసంగా వేడుక నిర్వహించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ దేశ ప్రధాని లీ కియాంగ్, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ దేశాధ్యక్షుడు టు లామ్, లావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ప్రధాన కార్యదర్శి, లావో అధ్యక్షుడు తోంగ్లున్ సిసౌలిత్, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్, విదేశీ అతిథులు, దౌత్యాధికారులు వేదికను అలంకరించారు. వేడుకకు వేలాది మంది హాజరయ్యారు. ఉత్తర కొరియా జెండాలు ఊపుతూ సందడి చేశారు. తమ కేరింతలతో ఉత్సాహభరిత వాతావరణం సృష్టించారు. కిమ్ జాంగ్ ఉన్ ప్రసంగిస్తూ ఉత్తర కొరియాను ప్రపంచంలోనే ఉత్తమ సోషలిస్టు దేశంగాగా మారుస్తానన్నారు. తమ పార్టీ నిర్మాణ చరిత్రను, విప్లవాత్మక పాత్రను వివరించారు. అమెరికా బెదిరింపులకు తలొగ్గకుండా తమ దేశం పోరాడుతోందని అన్నారు. ఆర్థిక పురోగతి, దేశీయంగా అణ్వస్త్రాల తయారీలో సాధించిన ప్రగతి గురించి మాట్లాడారు. అణ్వస్త్రాల తయారీ, ఆర్థిక ఎదుగుదల కోసం నిర్విరామంగా పనిచేస్తున్నామన్నారు. అమెరికా సామ్రాజ్యవాదుల అణు యుద్ధం బెదిరింపులు పెరుగుతుండటంతో తమ శక్తిసామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు. మన విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడి క్లిష్ఠమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ... రాజకీయ, సైనికపరంగా పరిష్కారాల కోసం తమ పార్టీ, ప్రభుత్వం పనిచేస్తున్నదని కిమ్ చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నామని, ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకెళుతున్నామని, సమీప భవిష్యత్‌లో ఆర్థికంగా మరింత బలపడతామని కిమ్ జాంగ్ ఉన్ దీమా వ్యక్తంచేశారు. అందమైనసుసంపన్న దేశంగా, సోషలిస్టు స్వర్గంగా ఉత్తర కొరియాను తీర్చిదిద్దుతానన్నారు.
ఉత్తమ సోషలిస్టు దేశంగా ఉ.కొరియా
- Advertisement -
RELATED ARTICLES


