నవంబరు నెలాఖరుకు బకాయిలు చెల్లించేలా మంత్రి హామీ
విశాలాంధ్ర – సచివాలయం:రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవను శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆషా) వెల్లడిరచింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు, ఆషా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమ య్యాయి. కొన్ని రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని, తమ బకాయిలన్నింటిని నవంబరు నెలాఖరులోగా పూర్తిగా చెల్లించేలా మంత్రి హామీ ఇచ్చారని, దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరిసు న్నట్లు శుక్రవారం సచివాలయంలో మంత్రితో సమావేశం అనంతరం ఆషా ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మంత్రికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సత్యకుమార్ ఛాంబరులో మంత్రి, అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ బకాయిలను వన్ టైం కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం అమలులోకి వచ్చేలోగా మూడో విడత కింద మరికొంత మొత్తాన్ని చెల్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా, అక్టోబరు 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సేవలను నిలిపివేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రి సత్యకుమార్ ప్రయత్నంతో ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి రూ.488 కోట్లు చెల్లించింది. మరో విడత కింద కొంత మొత్తం చెల్లింపులు జరిగిన అనంతరం సుమారు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ప్రభుత్వం రుణం రూపంలో ఆసుపత్రుల వారికి చెల్లించేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే నాటికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు తరపున ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల విలువ రూ.2,403.92 కోట్లు. ఆ తరువాత నుంచి అక్టోబరు 27వ తేదీ వరకు రూ.5,419 కోట్ల బిల్లులు ఎన్టీఆర్ ట్రస్టుకు ఆసుపత్రుల నుంచి వచ్చాయి. మొత్తం మీద బిల్లుల విలువ రూ.7,823.42 కోట్లకు చేరింది. ఇందులో రూ.4,143 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. మిగిలిన బకాయిలను చెల్లించేందుకు కార్యాచరణ సిద్ధమవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిస్ధాయిలో పునరుద్ధరిస్తున్నట్లు మంత్రితో చర్చల అనంతరం ప్రకటించారు. మరోవైపు, ప్రభుత్వం తీసుకురానున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద తీసుకునే నిర్ణయాల్లో సంఘం ప్రతినిధులను భాగస్వాములను చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో పాటు పెండిరగ్‌లో ఉన్న ఆసుపత్రుల బిల్లుల పరిశీలనకు 50 మంది వైద్యులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బకాయిల్లో భాగంగా ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న రూ.670 కోట్లు కూడా తొందరగా విడుదల చేయాలని ఆషా ప్రతినిధులు చర్చల సందర్భంగా కోరారు. ఆశా ప్రతినిధుల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి సహకరించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈవో దినేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


