Friday, March 6, 2026
Homeవ్యాపారంఎస్కార్ట్స్ కుబోటా కొత్త 'సౌత్ స్పెషల్' వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం

ఎస్కార్ట్స్ కుబోటా కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం

- Advertisement -

న్యూదిల్లీ: వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్, పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్
సిరీస్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ సిరీస్లో 39 హెచ్పి నుండి 52 హెచ్పీ విభాగాలలో ఐదు వేర్వేరు రకాలను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలోని వరి సాగు ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి వరి, మాగాణి ప్రత్యేక సిరీస్ ఇది. పవర్ ట్రాక్ బ్రాండ్
ద్వారా ఈ రకమైన ప్రత్యేక శ్రేణిని పరిచయం చేయడం ఇదే తొలిసారి. దీని ద్వారా కీలకమైన వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో కంపెనీ తన ఉనికిని మరింత బలోపేతం
చేసుకుంటోంది. భారతదేశంలో ఎస్కార్ట్స్ కుబోటా సంస్థ.. కుబోటా, ఫాక్స్ట్రాక్ మరియు పవర్క్ అనే మూడు బ్రాండ్ల పేరుతో ట్రాక్టర్లను విక్రయిస్తోంది. ఇవి వరుసగా
ప్రీమియం, ఎంట్రీ-ప్రీమియం, వాల్యూ విభాగాల అవసరాలను తీరుస్తున్నాయి. వీటిలో పవర్స్టాక్ బ్రాండ్ అనేది తక్కువ ఖర్చుతో కూడిన వాల్యూ, మాస్ సెగ్మెంట్ విభాగాలకు
ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బ్రాండ్ కింద వివిధ రకాల వ్యవసాయ పనులకు ఉపయోగపడే ట్రాక్టర్లను కంపెనీ అందిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు