Homeవ్యాపారంఏపీలో ఓలా ఎలక్ట్రిక్‌ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ డెలివరీలు షురూ

ఏపీలో ఓలా ఎలక్ట్రిక్‌ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ డెలివరీలు షురూ

- Advertisement -

విజయవాడ : భారతదేశంలో అతిపెద్ద ప్యూర్‌-ప్లే ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ పోర్ట్‌ఫోలియో మోటర్‌సైకిళ్ల డెలివరీలను మంగళవారం ప్రారంభించినట్లు వెల్లడిరచింది. దాని రైడ్‌ ది ఫ్యూచర్‌ ప్రచారంలో భాగంగా మొదటి 5,000 మంది కస్టమర్లకు కంపెనీ రూ. 10,000 విలువైన ఆఫర్‌లను కూడా ప్రకటించింది. వీటిలో విస్తరించిన వారంటీ, మూవ్‌ఓఎస్‌ ప్లస్‌, ఎసెన్షియల్‌ కేర్‌ను ఉచితంగా పొందే అవకాశం కలుగుతుంది. పనితీరు, భద్రతను పెంచే మిడ్‌-డ్రైవ్‌ మోటరుతో రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌ వస్తుంది. రోడ్‌స్టర్‌ సిరీస్‌ పవర్‌ట్రెయిన్‌లో చైన్‌ డ్రైవ్‌, సమర్థవంతమైన టార్క్‌ బదిలీ కోసం ఇంటిగ్రేటెడ్‌ ఎంసియు కూడా ఉన్నాయి, ఇది ఉన్నతమైన త్వరణం, మెరుగైన శ్రేణిని అందిస్తుంది. రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌ మోటర్‌సైకిళ్లలో ఫ్లాట్‌ కేబుల్‌లను కూడా కలిగి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు