Thursday, December 12, 2024
Homeకర్షక, కార్మికాగ్రహం

కర్షక, కార్మికాగ్రహం

. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
. నాలుగు లేబర్‌కోడ్‌లు ఎత్తివేయాలని డిమాండ్‌
. ఏపీ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మికసంఘాల ఐక్యవేదిక ధర్నాలు
. రాజ్యాంగ లక్ష్యాలను కాపాడాలని రాష్ట్రపతికి ఓబులేసు, వడ్డే, కేవీవీ వినతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రైతు, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ సంయుక్త కిసాన్‌మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన 25 ప్రధాన డిమాండ్లపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. రాజ్యాంగ లక్ష్యాలను నీరుగార్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై రైతు, కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు, కార్మికులతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, దళిత, ఆదివాసి, మైనార్టీ,మహిళా సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు పన్నులు కడుతుంటే, లాభాలు కాంట్రాక్టర్లకు అందుతున్నాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుంటే, కార్పొరేట్లకు భారీ రుణమాఫీలు చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన తప్పుడు విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకే రాజ్యాంగ దినోత్సవమైన నవంబరు 26వ తేదీన ఈ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు వెల్లడిరచారు. ఈ పిలుపులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగర సమితికి చెందిన రైతు, కార్మిక సంఘాల అధ్వర్యంలో విజయవాడలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రైతులు పండిరచే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు లేబర్‌ కోడ్‌లు ఎత్తివేయాలని నినదించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడ నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ విగ్రహం మహాస్మృతి వనం వరకు ప్రదర్శన సాగింది.
అనంతరం ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ డాక్టర్‌ ఎంఎస్‌ సోమనాథన్‌ రైతు కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆత్మహత్య నివారణకై కేరళ తరహాలో ‘ రైతు రుణ ఉపవమన చట్టం’ను ఏపీలో కూడా తీసుకురావాలన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, నిర్బంధ భూసేకరణ చేయరాదని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజు వేతనం రూ.600లకు పెంచాలని, ఒప్పంద, పొరుగు సేవలు, రోజువారీ, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు. సీపీఐ నగర విజయవాడ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, వై. కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యు. ఉమామహేశ్వరరావు, ఇఫ్టూ నేతలు పి. పోలారి, పి. ప్రసాద్‌, ఏఐయూటీసీ నాయకులు సుధీర్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె. ఉమామహేశ్వరరావు, సుబ్బరావమ్మ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలవరపు కృష్ణా, ఏఐసీసీటీయూ ఈశ్వర్‌, డి. హరినాధ్‌, యు.వీరబాబు, టి.ప్రకాష్‌, ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి : పి.రామచంద్రయ్య
ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని, దుర్మార్గమైన నాలుగుకోడ్‌లను రద్దుచేయాలని రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. జాతీయ సంఘాల పిలుపు మేరకు కర్నూలు, ఆదోనిలో బారీ ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఏపీ రైతుసంఘంరాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం,చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు , సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, కార్మిక, రైతుసంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కర్నూలు జిల్లా పరిషత్‌ నుండి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు విడనాడాలి: ఆర్‌.రవీంద్రనాథ్‌
దేశ ప్రజలకు నష్టం కలిగించే కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర కార్మిక,రైతు సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు అధ్యక్షతన ఈ ధర్నాను ఉద్దేశించి ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర కార్యదర్శి డి.వర్మ మాట్లాడారు. సర్వసంపదలు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు