Wednesday, February 18, 2026

కూటమి

- Advertisement -

కూటమి
అది ఎప్ప్పుడు వెన్నంటే ఉంటోంది
చిన్నతనం నుంచి ఇప్పటివరకు నీడల్లే
అంటిపెట్టు తిరుగుతోంది
దానితో జత కట్టానని అందరూ
నన్ను ఈసడించుకున్నారు
నాది చేతకానితనమన్నారు
సుడి లేనివాడు…
దశలేనోడు అనీ తిట్టిపోశారు
ఎవరెన్నన్నా అది నన్ను వదిలిపోలేదు
దాన్నో చూసి నేను దడిసిపోనూ లేదు
కృషి చేశా పడి లేచా
కవిత్వంతో అక్షరాల మాల కట్టా
అద్భుత పదవిన్యాసాలు చేశా
సమాజం మెడలో వరమాలగా పెనవేశా
అది చూసి లోకం మురిసింది
నా విజయం హర్షమై కురిసింది
అప్పటివరకు నన్ను అంటిపెట్టుకున్న
ఆ రెండో నీడ శోకిస్తూ పోయింది
అదే ఓటమి…
నా విజయానికి కూటమి…
ఇప్పటివరకు అంటిపెట్టుకున్నవి
రెండు నీడలే అనుకున్న
నా విజయం తర్వాత తెలిసింది
నన్ను అనుసరిస్తూ మరెన్నో నీడజాడలు.
చలపాక ప్రకాష్‌, 9247475975

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు