Homeసాహిత్యంకొత్తపల్లి రంగారావు : మరుగున పడిన తొలితరం మార్‌కి స్స్టు సాహిత్య విమర్శకుడు

కొత్తపల్లి రంగారావు : మరుగున పడిన తొలితరం మార్‌కి స్స్టు సాహిత్య విమర్శకుడు

- Advertisement -

ఎన్. వేణుగోపాల్

రచన రచయితకు సాహిత్యలోకంలో శాశ్వత స్థానం ఇస్తుందని భ్రమ పడుతుంటాం. ఒక్క రచనతో సాహిత్య ప్రపంచంలో గుర్తుంచుకోదగిన రచయితగా నిలిచిపోయే అవకాశం ఎంత ఉందో, ఎన్నో రచనలు చేసి కూడా విస్మరణకు గురయ్యే ప్రమాదమూ అంత ఉంది. కవిత్వం, కథ, నవల వంటి ఎక్కువ మంది రచయితలు ఉండే ప్రక్రియల్లో మాత్రమే కాదు, సాహిత్య విమర్శ వంటి చాలా తక్కువ మంది రచయితలు ఉండే రంగంలో కూడా విస్మరణ ప్రమాదం ఉంది. ఒకప్పుడు చాల వ్యాసాలూ పుస్తకాలూ రాసి, ప్రభావశీలంగా ఉండి, తర్వాతికాలంలో సాహిత్య విమర్శ చరిత్రలో పేరు కూడా కనబడకుండా, కనీసం జాబితాలో ప్రస్తావన కూడా లేకుండా పోవచ్చు. సాధారణ పాఠకులకు మాత్రమే కాక, ప్రత్యేకంగా ఆ రంగంలో పని చేస్తున్నవారికి కూడా తెలియకుండా పోవచ్చు.
నాకు కలిగిన ఈ ఎరుకను మీతో పంచుకోవాలని రాస్తున్నాను. విజయవాడ నుంచి వెలువడే విప్లవ కమ్యూనిస్టుల మాసపత్రిక ‘జనశక్తి’ 2026 మే సంచికలో కొత్తపల్లి రంగారావు రాసిన ‘కమ్యూనిస్టులూ – సాహిత్యం’ అనే వ్యాసం వచ్చింది. అది 1953 సెప్టెంబర్‌లో వెలువడిన ‘కమ్యూనిస్టులూ – సాహిత్యం’ అనే వ్యాస సంపుటి నుంచి ప్రచురించారు. అంటే బహుశా అది తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ తొలి పుస్తకాల్లో ఒకటి. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ చరిత్ర మీద నాలుగైదు వ్యాసాలు రాసినవాడిగా, ఉపన్యాసాలు చేసినవాడిగా, ప్రత్యేకించి తెలుగులో తొలి మార్క్సిస్టు సాహిత్య విమర్శ వ్యాసం 1944లో వెలువడిందా, 1946లో వెలువడిందా అని కాస్త పరిశోధించి, నాకంటే ముందు రాసినవాళ్లకు సవరణ ప్రతిపాదించిన వాడిగా కొత్తపల్లి రంగారావు పేరే విననందుకు, ఆయన పుస్తకాలూ వ్యాసాలూ చూడనందుకు సిగ్గుపడ్డాను. నా పరిశోధనకూ తవ్వకపు పనికీ కూడా దొరకకుండా ఉండిపోయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు ఒకరున్నారే అని ఆశ్చర్యపోయాను. పాత పుస్తకాల బంగారు గనులు ఎం వి రాయుడు, రమణమూర్తి గార్ల సహకారంతో పరిశోధన లోకి దిగితే చాలా కొత్త విషయాలు తెలిశాయి.
గుంటూరు జిల్లా అమృతలూరుకు చెందిన కొత్తపల్లి రంగారావు (విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ) అరుణోదయ ప్రచురణలు అనే బహుశా సొంత ప్రచురణ సంస్థ పేరుతో 1953 సెప్టెంబర్‌లో ‘కమ్యూనిస్టులూ – సాహిత్యం’ అనే వ్యాస సంపుటి ప్రచురించారు. ఆ 80 పేజీల, రెండు వ్యాసాల సంపుటాన్ని “సర్వతోముఖ ప్రతిభాశాలి, మార్క్సిస్టు మహా మోపాధ్యాయుడు, ప్రపంచ శ్రామిక జననేత, అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడు, సుస్థిర శాంతిదాత, శాశ్వత కీర్తికాయుడు, పూర్ణ మానవుడు కామ్రేడ్ స్టాలిన్ దివ్య స్మృతులకు” అంకితం చేశారు. ‘కమ్యూనిస్టులూ – సాహిత్యం’, కళాశాస్త్ర వాంగ్మయాలూ – కమ్యూనిజం’ అనే రెండు వ్యాసాలతో పాటు ‘అవతారిక’ అని తానే రాసుకున్న ముందుమాట కూడా ఉంది.
వీటిలో మొదటి వ్యాసం “1950లో జనవాణిలో అచ్చయిన తన వ్యాసాలకు” కొనసాగింపు అనీ, వీటిని “1943 నుంచి అప్పటివరకూ రెండు మూడుసార్లు తిరుగవ్రాసి విజయవాడ (1944) మొöö చోట్ల జరిగిన అభ్యుదయ రచయితల మహాసభల సందర్భంలోనూ, ఇతర విధాలుగానూ ప్రముఖ పత్రికా సంపాదకుల, రచయితల సమిష్టి ఆలోచనకు సమర్పిస్తూ, చేసిన సుదీర్ఘ కృషి ఫలితమ” ని ఆ ముందుమాటలో రాసుకున్నారు. “ఇందలి ముఖ్య భాగాలు కొన్ని 1945లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభలో చదువబడ్డాయి” అని కూడా రాశారు. తన రచనల వల్లనే కొడవటిగంటి, ఆరుద్ర, అనిశెట్టి, రమణారెడ్డి, సోమసుందర్ ప్రభృతులు తమ లోపాల్ని దిద్దుకున్నారని కూడా రాశారు. అలాగే రెండో వ్యాసం చిత్తుప్రతి 1946లో రాశానని అన్నారు.
ఈ ముందుమాటలోని విషయాల్ని బట్టి చూస్తే కొత్తపల్లి రంగారావు, 1944లో తొలి మార్క్సిస్టు సాహిత్య విమర్శ వ్యాసం రాసిన మద్దుకూరి చంద్రశేఖర రావుతో సమానంగానో, ఇంకా ముందేనో ఈ రంగంలో కృషి చేశారనిపిస్తుంది.
ఈ పుస్తకం వెనుక అట్ట మీద “త్వరలో…” అంటూ ఆయన రాసినవే ఏడు పుస్తకాల ప్రకటన కూడా వేశారు. ‘ప్రజలూ – సాహిత్యం’ (సారస్వత వ్యాస సంపుటి), ‘పల్లెపదాలూ – స్త్రీల పాటలూ’ (భూస్వామ్య సమాజంలో పల్లెలలోని కుటుంబ జీవితాన్ని చిత్రించే పాటలు మార్క్సిస్టు దృక్పథంతో గూడిన విమర్శతో), ‘విప్లవ పాఠాలు’ (వివిధ జీవిత సమస్యలపై మార్కుస్‌-ఎంగెల్సు, లెనిన్ – స్టాలిన్, మావో, గోర్కీ మొదలైన పార్టీ నాయకులు, పార్టీ రచయితలు ప్రవచించిన మూలసూత్రాలు పాఠాలుగా కూర్చిన మార్క్సిస్టు విజ్ఞాన సర్వస్వం), Tష్ట్రవ ఖీuఅdaఎవఅtaశ్రీ Pతీiఅciజూశ్రీవs శీట వీaతీxisఎ – Lవఅiఅisఎ (A Cశీఅcisవ జుఅcycశ్రీశీజూవdia శీట వీaతీxisఎ – Lవఅiఅisఎ), ‘ఇంగ్లీషు – తెలుగు వ్యాకరణం’ (సాదృశ్య వైదృశ్యాత్మాకం), ‘భాషాశాస్త్ర మూలసూత్రాలు’, ‘సాహిత్య శాస్త్రం’ అనేవి ఆ ఏడు పుస్తకాలు. అలాగే పుస్తకం చివరి పేజీలో “కొద్ది కాపీలే ఉన్నాయి!’ “త్వరపడండి” అంటూ Tష్ట్రవ Guidవ tశీ Liటవ aఅd Litవతీatuతీవ (A Cశీఅcisవ జుఅcycశ్రీశీజూవdia iఅ tష్ట్రవ టశీతీఎ శీట Pతీశీvవతీఎs & Sayiఅgs), మార్గదర్శి (సంగ్రహ విజ్ఞాన సర్వస్వం), బ్రతుకుబాటలు (విప్లవ గేయ కావ్య సంపుటి) అని మరొక మూడు పుస్తకాల ప్రకటన వేశారు.
ఈ పది పుస్తకాలలో ‘బ్రతుకు బాటలు’, ‘మార్గదర్శి’, ‘భాషాశాస్త్ర మూలసూత్రాలు’ (1955) మూడు మాత్రమే దొరికాయి.
ఇంకా ఈ ప్రకటనల్లో లేని ‘అరుణతారలు’ (1957) అనే పిల్లల పాటల సంపుటం, ‘పాలపుంత’ (1955) అనే పొడుపు కథల పుస్తకం కూడా దొరికాయి. అంటే ఇప్పటికీ తెలిసినంతవరకు ఆయన కవిత్వం, జానపద సాహిత్యం, పిల్లల సాహిత్యం, సాహిత్య విమర్శ వంటి విభిన్న రంగాలలో పనిచేసి కనీసం పదమూడు పుస్తకాలు ప్రచురించారు. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఉండవచ్చు.
అయితే 1945 నాటికే అభ్యుదయ రచయితల సభల్లో మాట్లాడుతూ, 1950 నాటికే జనవాణి వంటి పత్రికలో వరుసగా వ్యాసాలు రాసి, 1953-57 మధ్య పదమూడు పుస్తకాలు ప్రచురించిన ఒక రచయిత పేరు కనీసం జాబితాల్లోనైనా ఎందుకు కనబడకుండా పోయిందన్నది ప్రశ్న.
ఆ రచనల్లో లోతు ఎంత, సమకాలీనంగా వాటి ప్రభావం ఎంత ఉండింది, ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల తర్వాత వాటిలో గుర్తించదగిన లోపాలేమిటి వంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నప్పటికీ, 1940ల్లో, 50ల్లో తెలుగు సాహిత్యానికి మార్కిస్జాన్ని అన్వయించి సాహిత్య విమర్శ రాయడానికి ప్రయత్నించిన తొలితరం మేధావుల్లో ఒకరైన కొత్తపల్లి రంగారావుకు జోహార్లు. ఇంకా వివరాలు సంపాదించాలి. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శకుల జాబితాలో తప్పకుండా ఆయన పేరు చేర్చాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు