ఖమ్మం : భారతదేశంలో విశ్వసనీయ ఫెర్టిలిటీ సంరక్షణ నెట్వర్క్లలో ఒకటైన, 16 సంవత్సరాలకు పైగా క్లినికల్ నైపుణ్యం కలిగిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఖమ్మంలో తన కొత్త, పూర్తి స్థాయి ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించింది. ఈ నూతన కేంద్రం ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ఒయాసిస్ ఫెర్టిలిటీ, తన సుస్థిర ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఒయాసిస్ ఫెర్టిలిటీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన కేంద్రాల నెట్వర్క్ను నిర్మించింది. దీంతో పట్టణ, ప్రాంతీయ ప్రాంతాలలోని జంటలు తమ సమీపంలోనే ప్రత్యేక ఫెర్టిలిటీ చికిత్స సేవలను పొందగలుగుతున్నారు. తెలంగాణ అంతటా సుస్థిరమైన, సైన్స్ ఆధారిత ఫెర్టిలిటీ సంరక్షణను అందించడంలో నిరంతర నిబద్ధతను, తాజాగా ఖమ్మంలో రూపుదిద్దుకున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతిబింబిస్తుంది. ఫెర్టిలిటీ చికిత్సల ఫలితాలపై, సకాలంలో వైద్య పరీక్షలు మరియు తగిన వైద్య మార్గదర్శకత్వం కీలక ప్రభావం చూపుతాయని ఒయాసిస్ ఫెర్టిలిటీ కో`ఫౌండర్, మెడికల్ డైరెక్టర్, డా. దుర్గా జి. రావు అన్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సీఈఓ పుష్కరాజ్ షెనాjŽT మాట్లాడుతూ, ఖమ్మంలోని మా సెంటర్ ఈ ప్రాంతంలోని జంటలకు సాక్ష్యాధారిత ఫెర్టిలిటీ చికిత్సల సహాయంతో తల్లిదండ్రులయ్యే వీలు కల్పిస్తుందని, ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ అని తెలిపారు.


