Thursday, December 11, 2025
Homeచిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరి

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరి

- Advertisement -

విశాలాంధ్ర`చిత్తూరు: చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసులో ఐదుగురు దోషులకు చిత్తూరు కోర్టు శుక్రవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడిరచింది. తీర్పు నేపథ్యంలో చిత్తూరు కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు చిత్తూరు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపారు. 2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాల యంలోనే ఈ ఘటన చోటుచేసు కుంది. ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమే యం ఉందని చిత్తూరులోని ఆరో అదన పు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. న్యాయస్థానం వారికి శుక్రవా రం ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. తనకు కేసుతో సంబంధం లేదని కాసరం రమేష్‌(ఏ22) పిటిషన్‌ దాఖలు చేయగా… అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కేసు విచారణ సాగుతుండగానే ఎస్‌.శ్రీనివాసాచారి(ఏ21) మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్‌ భర్త మోహన్‌ మేనల్లుడు శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ(ఏ1), గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్‌ వెంకటేష్‌(ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డి(ఏ3), మంజునాథ్‌ అలియాస్‌ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్‌(ఏ5) దోషులుగా తేలారు. దీంతో వారికి ఉరిశిక్ష విధించింది. దోషుల్లో ఏ1గా ఉన్న చింటూ రూ.70 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కటారి అనురాధ, మోహన్‌ వారసులకు రూ.50 లక్షలు, గాయపడిన వేలూరి సతీష్‌ కుమార్‌ నాయుడికి రూ.20 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది. కాగా, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కటారి మోహన్‌కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. దీంతో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహన్‌ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబరు 17న చింటూ, మరో నలుగురు బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కటారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా… ఆమె అక్కడే నేలకొరిగారు. పక్క గదిలో ఉన్న కటారి మోహన్‌ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్‌ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. మేయర్‌ దంపతుల హత్య సమయంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్‌ కుమార్‌ నాయుడినీ చంపేందుకు మంజునాథ్‌(ఏ4) యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఇందులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశారని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 130 మంది సాక్షులను విచారించారు. ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్‌… అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. దోషులను కడప జైలుకు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు