Homeజాతీయంజ్యుడిషియల్ కస్టడీకి స్వతంత్ర భరద్వాజ్

జ్యుడిషియల్ కస్టడీకి స్వతంత్ర భరద్వాజ్

- Advertisement -

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఒక విద్యార్థి తండ్రిపై దాడి చేశారన్న ఆరోపణలతో పాటు ఇతర అభియోగాలకు సంబంధించి హిందుత్వవాది స్వతంత్ర భరద్వాజ్‌ను దిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. దాడికి సంబంధించి భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన చేపట్టిన కొన్ని గంటల తర్వాత శుక్రవారం బులంద్షహర్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 23న జరిగిన నిరసన సందర్భంగా తాను విద్యార్థి తండ్రి తలపగలగొట్టానని, తన రాజకీయ సంబంధాల కారణంగా అరెస్టు నుంచి తప్పించుకున్నానని భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. శనివారం భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… జడ్జి లాలర్ నివాసంలో హాజరుపరిచారు. నిందితుడిని ఒక రోజు కస్టడీ విచారణకు అనుమతించాలని దిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి అనుమతించారు. ఆదివారం భరద్వాజ్‌ను ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అదనపు సెషన్స్‌ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలర్… భరద్వాజ్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబరు 21 వరకు పొడిగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు