చింతపట్ల సుదర్శన్
గోడ మీద కూర్చుని ఉంది ఓ పిల్లి. దాని కళ్లకు కనిపిస్తున్నది ఎదురుగ్‌గా ఉన్న కన్నం. కన్నంలో ఉన్నది ఓ ఎలక. అది బయటికి వస్తే ‘అటాక్’ అంటూ దూకేయడం అంతే అనుకున్న పిల్లి కంటి చూపు ఒకే చోట కేంద్రీ కృతం చేసింది. చూపు మరల్చేది లేదు. ఏ శబ్దమూ ఇప్పుడు దాని చెవులకు వినిపించనే వినిపించదు. అరుగు ఎక్కిన కుక్కకి పిల్లి కనబడినది. ఎంత ధయిర్యం దీనికి నా ముందే గోడ మీద పిల్చి కూచోవడం ఎంత అవమానం అనుకున్నది. దాని నెత్తురు ‘గీజర్ ఆకిట్వేట్’ అయి వేడెక్కసాగింది. చెవులు మిలిటరీ జవాన్లలా లేచి నిలబడినయి, తోక ఇనుప కడ్డీలా నిలబడినది. ఒక్క అరుపు అరిస్తే చాలు ఆ ఆగరÒ శత్రువు గోడ మీది నుంచి దూకి రెండు కాళ్లు లేదా కనీసం ఒక్కటయినా విరగ్గొట్టుకుంటుంది. మెడ పైకెత్తింది. ‘సౌండు సిస్టం ఆన్’ చేసింది. ఒక అరుపు మరో అరుపు ఇంకో అరుపు అయినయి. ఆశ్చర్యం! పిల్లి అరఅంగుళం కూడా కదల్లేదు. దాని తోక మిల్లీమీట రంత కూడా వణికింది లేదు. దాని చూపు పక్కకు తిరగనేలేదు. ‘అవ మానం ఎంత అవమానం! ఈ అవమానం దందహ్యమానమై మాడెంద మును దహించి వేయుచున్నదే!’ అన్న దుర్యోధనుడి డైలాగు గుర్తుకు వచ్చింది. సరిగ్గా ఈ సమయాన డాంకీ అరుగు మీదకు రానే వచ్చింది. ‘చూశావా! డాంకీ ఈ గోడ మీది పిల్లి నన్ను చూసి కదల డం లేదు. నా అరుపులకు ఏ మాత్రం బెదరడమూ లేదు. ఏం జరుగు తున్నదో నాకరœమే కావడం లేదు! అని శోకించింది. ‘శోకించతగదు మిత్రమా! ఏదీ నన్ను చూడనీ’ అంటూ డాంకీ గోడ మీది పిల్లిని ‘స్కాన్’ చేసింది. ఇది నిజంగా పిల్లేనా లేక పిల్లి బొమ్మా అని అనుమానించింది. ఖరీద యిన ‘సాఫ్ట్ టాయ్స్’ కొనే వాళ్లీ పక్కన లేరు కదా అనుకుంది. ఇది నిజం పిల్లిలానే ఉంది. కాకపోతే కుక్క అంటే భయం పోయిన ఈతరం పిల్లిలాగుంది. మనుషులలో తరాల అంత రాలు, ‘ఐక్యూ’ తేడాలు ఉన్నట్టే నాలుక్కాళ్ల జీవాల్లోనూ ఉండవచ్చు నేమో అనుకుని పలకరిస్తే పోయేది పలకరింపే కాని మన సొమ్మేం పోదుకదా అని ‘ఏయ్! పిల్లీ ! గోడ మీది పిల్లీ ! నువ్వు నిజం పిల్లివా? ఉలన్ గుడ¦లో కూర్చిన దూది పిల్లివా ? అనడిగింది . గారÆభ స్వరం విన్న పిల్లి ‘కాన్సన్ట్రేషన్’ దెబ్బ తింది. విసుక్కుంటూ ఎవడి పొట్ట తిప్పలు ఎవడరœం చేసుకుంటాడు కనక అనుకుని, ‘నేను పిల్లినే! గోడ మీది పిల్లినే! ‘ఏఐ’ క్యాట్నేమీ కాదు’ అంది. ‘అవున్నిజమే నిజంగా నువ్వు గోడ మీది పిల్లివే. మరి నీకిదేం పోయేకాలం. అప్పు ట్నించి ‘డాగీ’ అరుస్తున్నా పట్టించుకోవడం లేదట. ఇంత భయం లేకుండా ఎలా ఉండగలుగుతున్నావ్? ’ అని కోప్ప డింది. డాంకీ. “అవునా నిజం గానా! నా ప్రతిపక్ష సభ్యుడు అరుస్తుంటే అధికార పక్షం వాడిలా నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయానా! సారీ! నేనది డాగీ అనుకోలేదు. ఏ మనిషో కుక్కతల తగిలించుకుని ‘జోక్’ చేస్తున్నాడను కున్నా’ అంది పిల్లి మీసాల్ని నాలుకతో దువ్వుకుంటూ. ‘అరే రాస్కెల్, ఇడియట్, నాలుక చీరేస్తా! వీపు విమానం మోత మోగిస్తా కళ్లు నెత్తికెకాక్కయా?’ అని కోపంగా అరిచింది డాగీ. ‘ఏంటది డాగీ ఈ మధ్య అసెంబ్లీ వైపు వెళ్లి వచ్చావా లేక ఏ ప్రెస్ మీటింగ్ హాల్‌లో సీట్ల మధ్య పడుకున్నావా? రాజకీయ నాయకుల భాష ఎంత బాగా వంటికి పట్టించుకున్నావ్’ అంది డాంకీ. అప్పుడొచ్చాడు అరుగు మీదకి అబ్బాయి. అబ్బాయిని చూసి కూడా గోడ వదల్లేదు పిల్లి పైగా ‘నువ్వు నిజం మనిషివేనా?’ అని అడిగింది. ‘అదేంటి అంత మాటనే శావు ఉద్యోగం రానంత మాత్రాన, నిరుద్యోగ భృతి అందు కోసంత మాత్రాన ‘మనిషిని కాకుండా పోతానా?’ అన్నాడు అబ్బాయి. అది కాదు ‘బ్రో’ ఈ మధ్యన ఏది అసలైందో ఏది నకిలీదో అర్థం అవడం లేదు. సెల్‌ఫోన్లలో మను షులు కుక్క ముఖా లూ, పంది ముఖాలూ, కోతి ముఖాలతో కనిపిస్తున్నారు. కబుర్లు చెప్తు న్నారు అని డాంకీ అంటే ‘గాడిద ముఖాలతో కూడా కనిపిస్తున్నారు’ అంది డాగీ. ‘అవును, నిన్నోమొన్నో నేనే చెప్పా నుగా ఆ మాట పైగా అది ‘ఏఐ’ మాయా జాలం అని కూడా చెప్పి నట్టున్నాను’ అన్నాడు అబ్బాయి. అసలు ఈ మనుషులకు ఇలాంటి వేషాలు ఎందుకు? అంది గోడ మీది పిల్లి. ఎందుకంటే వాళ్ల అసలు బుద్ధి తెల్సిరావడానికి, మనుషులు పైకి మనుషు లల్లే కనిపిస్తున్నా వాళ్లకి అరిచే కరిచే కుక్క బుద్ధి, బురదలో దొ‘ర్లే పంది లక్షణమూ, అవతలివాడి చేతిలోనిది లాక్కుపోయే కోతి చేష్ట, ఇక అయిందానికీ కాని దానికీ గాడిద అరుపూ అనేవి మాములైనవిప్పుడు అన్నాడు అబ్బాయి. బాగా చెప్పావు ‘బ్రో’ కోతి నుంచి వచ్చిన మనిషి వెనక్కు నడవడం మొదలు పెట్టినట్టున్నాడు. స్వంత లాభం కోసం ఏ వేష మైనా వేసేట్టున్నాడు. రెండు కాళ్ల మనిషి నాలుగు కాళ్ల జంతువులా ప్రవర్తించడమే కాక సభ్యతాసంస్కారం లేని భాష వాడేస్తున్నాడు’ అంది డాగీ. వేషము మార్చను, బూతులు నేర్చెను మోసము చేసెను అని పాటందుకుంది డాగీ .


