Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

విశాలాంధ్ర – తిరుపతి: తిరుపతి నగర పరిధిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు నిత్య కృత్యంగా మారిందని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. తిరుపతిలోని బాలాజీ పారా మెడికల్ నర్సింగ్ కళాశాల లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భీష్మాంజలి (19) బుధవారం హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెను పెళ్లకూరు మండలం చిరసంబేడు గ్రామానికి చెందిన రమణయ్య కుమార్తెగా గుర్తిచారు. కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని…ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో లైంగిక వేధింపులు తాళలేకనే విద్యార్థిని ఆత్మహత్యకు కారణం అని తెలియడంతో విద్యార్థి సంఘాల అధ్వర్యం లో మతురాలి తల్లితండ్రులు, బంధువులతో కలిసి కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా ఈ కళాశాల చైర్మన్ ప్రవీణ్ కుమార్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా హింసించే వాడని… అనేక మార్లు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన, కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న తమ కుమార్తెను కూడా శారీరకంగా కలవాలని వేధించేవాడని… విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. తాము పేదలం కాబట్టి ఏంచేయాలో తెలియక కుమిలిపోయామ న్నారు. అయితే ఆ విద్యార్థిని ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిందని కళాశాల యాజమాన్యం కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. దీంతో సీపీఐ, ఏఐఎసఎఫ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఆ కళాశాలలో పరిపాటిగా మారాయని, కళాశాల చైర్మన్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుండటంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. తాను చెప్పినట్టుగా వినకుంటే పరీక్షలలో ఫెయిల్ చేస్తామని విద్యార్థినుల ను బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ పరిస్థితులలో ఆ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేయలేక చాలామంది మధ్యలోనే చదువు మానేన్నారన్న విమర్శలు వెలువెత్తుతు న్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణ యించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తూ కట్టని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తి స్తున్నారని… కళాశాల అనుమతులు ఒక చోట, క్లాస్ లు ఒక చోట నిర్వహిస్తున్నారని… వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎసఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, నాయకులు ప్రవీ ణ్, చిన్న, హరి, వినయ్, సురేశ్, అశోక్, ఎనఎస్‌యూఐ నాయకులు మల్లి, బాలాజీ, నల్సా నాయకులు సుందర్ పాల్గొన్నారు. విద్యార్థిని మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ ఎస్సై హేమాద్రి అనుమానాస్పద మతిగా కేసు నమోదు చేశారు.
ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలి
సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్
లైంగిక వేధింపులకు పాల్పడుతూ అనేకమంది నర్సింగ్ విద్యార్థుల మరణానికి కారణమవుతున్న బాలాజీ పారా మెడికల్ నర్సింగ్ కాలేజి చైర్మన్ ప్రవీణ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తక్షణమే ఈ కళాశాల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాను చెప్పినట్టు వింటే ఫీజులు తగ్గిస్తామని, మార్కులు ఎక్కువేస్తానని మాయ మాటలు చెప్పి విద్యార్థినులను ప్రవీణ్ లోబర్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇలాంటివి పునరావృతం కాకుండా నర్సింగ్, పారామెడికల్ కళాశాల ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని, కళాశాల అనుమతులు రద్దుచేసి అక్కడ చదువుతున్న విద్యార్థులను మరో కళాశాలలకు మార్చాలని కోరారు. లేని పక్షంలో ఇలాంటి దుర్మార్గుడి కళ్లల్లో పడిన మరెందరో విద్యార్థినుల జీవితం నాశనమవుతుందన్నారు. ఇకనైనా కీచక ప్రవీణ్ పై ప్రభుత్వం చర్య తీసుకోకపోతే సీపీఐ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు