అభిషేక్‌శర్మకు గవాస్కర్ సలహా
న్యూదిల్లీ : టీమిండియా టీ20 ఓపెన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో తడబడుతుండటంపై భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. అతడికి ఓ విలువైన సూచన చేశాడు. తాను ఎదుర్కొంటున్న తొలి బంతినే బౌండరీ దాటించాలని భారీ షాట్‌కు ప్రయత్నిం చకుండా సింపుల్ షాట్‌తో ఓ సింగిల్ తీయాలని సూచించాడు. అప్పుడు అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుం దన్నాడు. ‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు మొదట సింగిల్ తీయాలి అంతే. అప్పుడు కాళ్లు కూడా కదులుతాయి. తర్వాత వేగంగా పరు గులు రాబట్టడానికి ప్రయత్నించాలి’ అని సూచిం చాడు. ‘అతడు న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫామ్, టచ్‌లో ఉన్నాడు. దాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఒక్కసారి క్రీజులో కుదురుకున్న తర్వాత పెద్ద షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాలి. అతడి నుంచి మనం అదే చూడాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్‌శర్మ ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఉదర సంబంధమైన సమస్యతో అతడు దిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అనంతరం ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ అతడు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో టీమిండియా గ్రూప్`ఎ నుంచి ఇప్పటికే సూపర్ 8కు చేరుకుంది. గ్రూప్ స్టేజిలో తన చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. ఈ టీ20లో అభిషేక్ శర్మ చక్కటి ఇన్నింగ్స్ ఆడి మరలా గాడిలో పడాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
తొలిబంతికే భారీషాట్ అవసరమా?… ఓ సింగిల్ తీసిచూడు
- Advertisement -
RELATED ARTICLES


