Thursday, December 11, 2025
Homeవిశ్లేషణదళితులపై దాడులు ప్రతిఘటించాలి

దళితులపై దాడులు ప్రతిఘటించాలి

- Advertisement -

దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై తక్షణం పోరాటాన్ని ప్రారంభించాలి. ఈ దాడులను ప్రతిఘటించకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే మనం అల్లకల్లోల పరిస్థితుల్లో జీవిస్తున్నాము. ప్రతి 18 నిమిషాలకు దళితులకు వ్యతిరేకంగా ఒక నేరం జరుగుతూనే ఉంది. ప్రతి వారం 13 మంది దళితులు హత్యకు గురవుతున్నారు. ప్రతిరోజూ దళితులపై 27 అత్యాచారాలు జరుగుతున్నాయి. భారత నేర నమోదు బ్యూరో ప్రకారం ప్రతి సంవత్సరం 45 వేల 935 దళితులపై నేర కేసులు నమోదు అవుతున్నాయి. నేర నమోదు బ్యూరో ప్రకటించిన దాని ప్రకారం దళితులపై ఎంత దారుణంగా నేరాలకు పాల్పడుతున్నది మనకు స్పష్టం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోవడమే లేదు. మహా అయితే దారుణమైన హింసాకాండను ఎవరో ఒక మంత్రి ఖండిరచడం జరగవచ్చు. దేశంలో ప్రతిరోజూ పదిమంది దళితుల మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. అమాయకులైన బాలికలు, యువతపైన, మహిళలపైన అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ శాంతి భద్రతలను పరిరక్షించవలసిన పోలీసులు అత్యాచారాలను, దౌర్జన్యాలను కనీసం నేరంగా పరిగణించి కేసులను కూడా నమోదు చేయడం లేదు. పాఠశాలల్లో దళిత బాలబాలికలను ముందు వరుసలో కూర్చొనేందుకు కూడా అనుమతించడం లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో కుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. దళితులు ఇతర దిగువ తరగతి ప్రజలపైన ఉన్నత వర్గాల ధనికులు రకరకాల దారుణాలను చేస్తున్నప్పటికి ప్రభుత్వాలు సైతం మౌనంగా ఉంటున్నాయి. ఈ దుర్మార్గపు సమస్య క్రమం తప్పకుండా నిరంతరాయంగా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. ఉన్నత కులాల దౌర్జన్యాలను వెనుకబడిన కులాల ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలి.
దళితులపై దౌర్జన్యాల సమస్యను మానవీయ, ప్రజాస్వామ్య పరిరక్షణ భావనతో తిరుగుబాటు చేయవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. దేశ వ్యాప్తంగా కుల భావనను పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యను దళితులు మాత్రమే కాదు దేశంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులు పోరాటంలో పాల్గొనాలి. ఈ పోరాటం దేశ వ్యాప్తంగా విస్తరించాలి. ఇండియాలో ప్రజాస్వామ్యం అప్పుడే వికసిస్తుంది. క్రమంగా ఇది సోషలిజం, సమానత్వం, అందరికీ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అణగారిన వర్గాల సమూహాలు దోపిడీదారులు కాదు. ఆర్థిక, సామాజిక దోపిడీదారుల బారినపడి అల్లాడిపోతున్నారు. ఈ దారుణాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సమాజం మొత్తం పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కష్టాలను ఎదుర్కొంటున్న కుల భావన పూర్తిగా నిర్మూలించాలనేది ఇక్కడ సమస్య కాదు. ఉన్నత, దిగువ కులాల భావనలు అంత తేలికగా సమసిపోవు. అయితే ఒక కులంపై మరో కులం ప్రత్యేకించి దళితులపై ఉన్నత కులాల ప్రజలు వ్యతిరేకతను కలిగి ఉంటారు. కులం, వర్గం ఆధారిత దోపిడీలను అందరూ కలిసి ఎదుర్కోవాలి. కులం ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏకీభావన అవసరం. కులతత్వం ప్రతిస్థాయిలోను, వీలైన అన్ని విధాలుగా బయటపెట్టాలి. మానవ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటరానితనాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అందువల్ల కులతత్వానికి వ్యతరేకంగా తర్కబద్దంగా పోరాటం సాగించాలి. సుప్రసిద్ధ మేధావి, కామ్రేడ్‌ ఎస్‌.జి.సర్దేశాయ్‌ ఇలా అన్నారు, ‘‘ కులం అనేది ఒంటెత్తు పోకడగా ఉండరాదు. గతితార్కిక భౌతికవాదంగా ఉండాలి. ప్రజాస్వామ్య ఐక్యత తప్పనిసరి, సమాజం మొత్తం ఈ భావనకు మద్దతు ఇవ్వాలి. కులంతో సంబంధం లేకుండా సమాజం ఈ భావనను కలిగి ఉండాలి. గుత్త పెట్టుబడిదారీ, బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా సంపన్నులైన రైతుల డిమాండ్లను సైతం బలపరచాలి. ఇండియా, ఇతర దేశాలలోను ఈ విధానాన్ని అవలంబించాలి. భారీగా భూములు గల భూస్వాములు ఆర్థిక సమస్యలు, వేతనాలు, రుణాలు, వడ్డీరేట్ల అక్రమాలపై సామూహిక పోరాటాలు జరుగుతున్న ఘటనలు కూడా ఉన్నాయి.’’
ప్రజా సమూహాలు ఐక్యంగా నూతన మార్గాలలో తప్పనిసరిగా ఆందోళనలను, పోరాటాలు జరపాలి. హరిజనులంతా ఐక్యం గాకపోతే భూస్వాములు, వడ్డీ వ్యాపారాల అక్రమాలపై పోరాడలేమని కామ్రేడ్‌ నానాపాటిల్‌ అన్నారు. శ్రామికులు దోపిడీదారులకు వ్యతిరేకంగా శ్రామికులు అరుణ పతాక ఉద్యమాన్ని నిర్వహించాలి. అరుణ పతాకం ఏనాడో అంటరానితనాన్ని సహించబోదని నానాపాటిల్‌ తెలిపారు. ఆయన చెప్పిన విషయాలను యాంత్రికంగా తిరిగి అనుసరించరాదు. సమాజంలో చోటు చేసుకున్న అంటరాని తనాన్ని సహించకూడదు. రిజర్వేషన్‌లపై ఈ సూత్రాన్ని రూపొందించినప్పటి నుంచి విస్తృతంగా చర్చలు జరిగాయి. ఊహించలేనంతగా కష్టాలను అనుభవిస్తున్నామన్న వాస్తవాలకు దూరంగా మనం ఉండలేము. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు అనుభవిస్తున్న కష్టాలను మనసులో ఉంచుకుని వీలైన అన్ని విధాలుగా రిజర్వేషన్లను పరిరక్షించకోవాలి. ఈ కులాలు అనుభవిస్తున్న కష్టాలకు ఆర్థికలేమి కారణం ఒక్కటే కాదు. భూస్వామి వ్యవస్థ ఇప్పటికి వీరిని వెంటాడుతూనే ఉంది. ప్రజాస్వామిక పమాజంలో మనుగడకు స్ధానంలేని విలువల నియంత్రణలో వీరి సాంస్కృతిక సామాజిక జీవనం సాగుతున్నది. అందువల్ల తప్పనిసరిగా రిజర్వేషన్‌ ఉండాలి. అయితే దీన్ని మనం బలిపశువుగా వినియోగించలేము. కొనసాగుతున్న వవివక్షను సమూలంగా సమాజం నుంచి నిర్మూలించాలి, భద్రతలు లేని హరిజనులకు ఇతర కులాల స్థాయిని అందుకోలేము. రిజర్వేషన్‌లు లేకుండా సమాజంలోని ఇతర వర్గాలతో సమంగా పరిగణించడం లేదు. ప్రజాస్వామిక భావనను ధ్వంసం చేసిన ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రిజర్వేషన్‌లు ఇతర వర్గాలతో గుర్తింపు పొందడానికి మొదటి చర్య, ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ తప్పనిసరి. రిజర్వేషన్‌లు వద్దని వారిస్తున్నా తిరోగామి శక్తులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని మితవాది, మనువాది దాడి జరుగుతున్న కాలంలో దిగువ కులాలపై హింస పెరిగిపోయింది. దీన్ని తక్షణం ప్రతిఘటించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు