Homeదీక్ష విరమణ ప్రసక్తే లేదు

దీక్ష విరమణ ప్రసక్తే లేదు

- Advertisement -
  • బలవంతం పెట్టి హక్కులు హరించొద్దు
  • యువతరం నమ్మకాన్ని కోల్పోతున్న సర్కారు
  • పార్లమెంటు భేటీకి ముందే ప్రధాన్ రాజీనామా చేయాలి
  • విద్యార్థులతో పాటు లద్ధాఖ్ కోసం పోరు: వాంగ్‌చుక్

న్యూదిల్లీ: తాను దీక్ష విమరించే ప్రసక్తే లేదని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తేల్చిచెప్పారు. అందుకోసం తనను బలవతం చేయొద్దని, తన రాజ్యాంగబద్ధ హక్కును హరించవద్దని అధికారులను కోరారు. 20న సీజేపీ పిలుపుమేరకు పార్లమెంట్ మార్Ì జయప్రదానికి వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఆయన దీక్ష శుక్రవారం 13వ రోజు కొనసాగింది. దిల్లీ, జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన 21వ రోజుకు చేరింది. వాంగ్‌చుక్ విలేకరులతో మాట్లాడుతూ ‘గత 12 రోజులుగా దీక్ష చేస్తున్నా. ఆకలి అదుపులోకి వచ్చింది. మొదట కష్టమనిపించింది కానీ ఇప్పుడు సమస్య లేదు. రోజుల తరబడి ఆహారం తీసుకోని కారణంగా శరీరంలో కండ`కొవ్వు తగ్గాయి కానీ మనోబలం తగ్గలేదని ఆయనన్నారు. ‘ఆరోగ్యం క్ష్మీణిస్తే అధికారులు జోక్యం చేసుకునే అవకాశం గురించి ప్రశ్నకు స్వచ్చంధంగానే దీక్ష చేస్తున్నా… నాతో బలవంతంగా దీక్ష విరమింపజేయించాల్సిన అవసరం ఏమిటి? నేను ఇష్టపూర్వకంగా దీక్ష చేస్తున్నాను. ప్రాణ హాని లేదు. వాళ్లు దీక్షను భగ్నం చేస్తే అది నా హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది’ అని వాంగ్‌చుక్ అన్నారు. ఇదేమీ ఉపకారం కాదు మా హక్కు అని వక్కాణించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారతీయులకు ఉందని అన్నారు. ఆ హక్కును అధికారులు గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ ఆందోళన శాంతియుతంగా సాగుతోందని చెప్పారు. భారత ప్రజాస్వామ్యంపై యావత్ ప్రపంచం దృష్టి ఉందన్నారు. పరీక్షా విధానంలో అక్రమాలు, జవాబుదారీతనం కోసం విద్యార్థుల పోరాటానికి మద్దతుగానే కాక లద్ధాఖ్ సమస్యల సత్వర పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నట్లు వాంగ్‌చుక్ తెలిపారు. ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ సరైనదన్నారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థులను గుర్తుచేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నదే తమ ఆందోళన ఉద్దేశమన్నారు. ‘ఈ ఏడాది 20 ఆత్మహత్యలు జరిగాయి… వచ్చే ఏడాదికి సంఖ్య 40 లేక 80కు పెరిగితే పరిస్థితి ఏమిటి? అలా జరగకూడదనే ఆందోళన చేస్తున్నాం’ అని వాంగ్‌చుక్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే, యువతరం విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వంపై వారిలో కోపం కట్టలు తెంచుకుంటోందని, ఇది కొనసాగితే రాజకీయంగా దెబ్బ తప్పబోదని హెచ్చరించారు. ప్రభుత్వం తన సొంత ప్రయోజనం కోసమైనా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాక ముందే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలన్నారు. అలా జరగని పక్షంలో తాము చేయగలిగింది చేస్తామని వాంగ్‌చుక్ హెచ్చరించారు.
వైద్యుల పర్యవేక్షణలో వాంగ్‌చుక్: అశుతోష్
వాంగ్‌చుక్ ఏడున్నర కేజీల బరువు తగ్గారని, ఆయన శరీరంలో చక్కరశాతం తక్కువగా ఉంటోందని… సత్తువ కోల్పోతున్నారని… మాట్లాడటానికి, నడవడానికి ఇబ్బంది పడుతున్నారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా వెల్లడించారు. రోజురోజుకు వాంగ్‌చుక్ ఆరోగ్యం క్ష్మీణిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. వైద్య బృందం ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం త్వరగా తమ డిమాండ్లను పరిష్కరిస్తుందని ఆకాంక్షించారు. ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం కోసం సీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానం గానీ ఆ దిశగా చర్యలుగానీ లేవని తెలిపారు. 20న పార్లమెంట్ మార్Ì శాంతియుతంగా విజయవంతం కావాలన్నారు.
ఆ వీడియోపై అభ్యంతరమేమిటి: దీప్కే
దీక్ష శిబిరంలోకి టెంట్లను అనుమతించాలని దిల్లీ పోలీసులను ప్రాధేయపడుతున్న తన వీడియోను ప్రభుత్వం నిషేధించడాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. అందులో అభ్యంతరకరంగా ఏమున్నదని నిలదీశారు.
తొలగిత వీడియో స్క్రీన్షాట్‌ను ఎక్స్లో పెట్టారు. దీక్ష చేస్తున్న విద్యార్థులకు వర్షం నుంచి రక్షణ కోసం టెంట్లు తెచ్చేందుకు అనుమతి కోరుతూ పోలీసుల కాళ్ళా వేళ్లా పడి దీప్కే బతిమాలిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ప్రభుత్వం తొలగించిన ఆ వీడియోను ఆయన మళ్లీ పంచుకున్నారు. దీనిపై అశుతోష్ రాంకా స్పందిస్తూ ఈ వీడియోలను తొలగించడంపై ఉన్న చిత్తశుద్ధి పేపర్ లీక్లను అడ్డుకోవడంపై ప్రభుత్వానికి ఉండివుంటే ఇలా జంతర్ మంతర్ వద్ద మేము ఆందోళన చేయాల్సిన అవసరమే వచ్చేది కాదని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు