Homeజిల్లాలుఅనంతపురంబాలికను కిడ్నాప్ చేసి బాల్య వివాహం.. ఐదుగురు అరెస్టు

బాలికను కిడ్నాప్ చేసి బాల్య వివాహం.. ఐదుగురు అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర-బొమ్మనహాల్: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా దేవగిరి గ్రామ శివారులోని పాత ఆంజనేయస్వామి దేవాలయంలో బాల్య వివాహం జరిపించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రైం నెం. 55/2026 కేసుకు సంబంధించి శుక్రవారం బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ బి. నబీ రసూల్ తన సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో దేవగిరి గ్రామానికి చెందిన బోయ వన్నూరుస్వామి (21), బోయ ఎల్లప్ప (52), బోయ గంగమ్మ (47), అలాగే బండూరు గ్రామానికి చెందిన బోయ అంజినేయులు అలియాస్ అంజినయ్య (41), బోయ పల్లవి అలియాస్ మరెక్క (29) ఉన్నారు.నిందితులను చట్టపరమైన నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు