Homeఅంతర్జాతీయంహోర్మూజ్ మా నియంత్రణలోనే: అమెరికా

హోర్మూజ్ మా నియంత్రణలోనే: అమెరికా

- Advertisement -

జలసంధిపై అమెరికా జోక్యాన్ని అనుమతించబోమని ఇరాన్ వెల్లడి
వాషింగ్టన్/తెహ్రాన్:
హోర్మూజ్ జలసంధి మా నియంత్రణలోనే ఉందని అగ్ర రాజ్యం అమెరికా స్పష్టం చేసింది. నౌకల రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది. ఈ జలమార్గం మీదుగా 800 నౌకలు సురక్షితంగా ప్రయాణించినట్లు తెలిపింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. హోర్మూజ్ జలసంధి మీదుగా నౌకలు రాకపోకలు సాగించాలంటే తాము నిర్దేశించిన మార్గాల్లోనే అవి ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ జలసంధి కార్యకలాపాల్లో అమెరికా జోక్యాన్ని తాము అనుమతించబోమని తెహ్రాన్ పేర్కొంది. దీనిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ…‘ఇరాన్ మీడియా చేసిన ప్రకటనలో నిజం లేదు. వాస్తవానికి హోర్మూజ్‌పై ఇరాన్‌కు ఎటువంటి నియంత్రణ లేదు. ఈ ఏడాది మే నుంచి ఈ జల మార్గంలో 800 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అమెరికా దళాలు భద్రత కల్పించాయి. వీటిల్లో 380 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు రవాణా అయ్యింది’ అని అమెరికా స్పష్టం చేసింది. ఇటీవల ఒమన్ కారిడార్ నుంచి ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను ఇరాన్ వెనక్కి పంపించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాము నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని తెహ్రాన్ వాటిని ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా…అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నప్పటికీ హోర్మూజ్ మీదుగా వాణిజ్య నౌకల ప్రయాణం యధావిధిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు