Homeనేపాల్ కకావికలం

నేపాల్ కకావికలం

- Advertisement -

మళ్లీ ప్రమాద ఘంటికలు ` పొంగిపొర్లుతోన్న సరస్సు

  • సర్వం కోల్పోయిన వేల కుటుంబాలు
  • 552కు పెరిగిన మృతులు
  • సీఎం సహాయ నిధికి విరాళంగా మంత్రుల నెల జీతం
  • పొంచివున్న ముప్పుపై నేపాల్, చైనా సమీక్షలు

ఖాటˆండు: నేపాల్ను వరద కమ్మేసింది. ఆ దేశంలో మృత్యువు ఘోషిస్తోంది. వరద, బురద ప్రవాహం పోటెత్తి సృష్టించిన బీభత్సం తీరని విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారానికి మృతుల సంఖ్య 547కి పెరిగింది. చైనా వైపు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 552కు చేరింది. రెండు దేశాలు చేసిన ప్రకటనల ప్రకారం 1,500 ఆచూకీ లేనట్లు వెల్లడైంది. విపత్తు సంభవించిన మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా, 3,742 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. 14,000 మందికిపైగా భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ఆచూకీ లేని విదేశీయుల్లో 320 మంది భారతీఅయులు ఉన్నట్లు అధికారిక సమాచారం. కాగా, బుధవారం సంభవించిన వరద పోటుకు భవనాలు వాహనాలు, వంతెనలు, ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. తొలుత వచ్చిన భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నది ప్రవాహానికి అడ్డుపడ్డాయి. అది ఉప్పెనగా మారింది. భోటే కోశీ, త్రిశూలి నదులు ఉప్పొంగాయి. టిబెట్లోనూ విధ్వంసం జరిగింది. జల ప్రళయం నుంచి తేరుకోలేని ఈ దేశాన్ని మళ్లీ వరద ముప్పు భయపెడుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. బురదలో కూరుకుపోయిన శవాలను ఒక్కొకక్కటిగా వెలికి తీస్తూనే… ప్రాణాలు కాపాడేందుకు భద్రతా`సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం టిబెట్ వైపున ఏర్పడిన కొత్త సరస్సు కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని నేపాల్ పోలీసులు హెచ్చరించారు. నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు కొండ ప్రాంతాల వైపుకు వెళుతున్నారని రాసువా జిల్లా ఉన్నతాధికారి నరేంద్ర పరియార్ వెల్లడించారు. జల ప్రళయానికి పేరుకున్న రాళ్లు, బురద, మంచుతో టిబెట్ వైపున ఏర్పడిన సరస్సు పొంగిపొర్లుతుండటంతో చైనా సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి టిబెట్ సరిహద్దులోని భోటే కోషి నదీ ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా సరస్సు ఏర్పడిందని నేపాల్కు చైనా ముందస్తు సమాచారం ఇచ్చింది. గురువారం ఉదయం నాటికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ప్రవహరించిన ఈ సరస్సులోకి మరో 30లక్షల క్యూబిక్ మీటర్ల నీరు రానున్నట్లు అంచనా వేసింది. అది తెగిపోతే మరోసారి వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బారియర్ లేక్ డ్యామ్ మళ్లీ బద్దలవడంతో నేపాల్కు రెండో ముప్పు ఉండటంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. బేరియర్ లేక్ నుంచి నీరు లీÅ£వుతోందని, ఏ క్షణమైనా భారీ వరద ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు చైనా హెచ్చరించింది. దీంతో టిబెట్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. పోలీసులు, సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ నేపాలీ పోలీసులు సామాజిక మాధ్యమంలో సూచించారు. అయితే అనంతరం పరిస్థితి కాస్త మెరుగవ్వడంతో చైనా సహాయక చర్యలు పున:ప్రారంభించింది.
బాలేంద్ర షా మంత్రి వర్గం భేటీ
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో పాటు మంత్రులు అందరూ తమ నెల జీతాన్ని ‘ప్రధాని సహాయ నిధి’కి ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం ఉదయం జరిగింది. తాజా పరిస్థితులను సమీక్షించింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. సహాయం, పునరావాసం, పునర్నిర్మాణం వంటి కీలకాంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఆచూకీ లేని 1,473 మంది
100 మంది విదేశీయులను కాపాడినట్లు నేపాల్ పర్యాటక బోర్డు తెలిపింది. 1,473 మంది ఆచూకీ లేరని పోలీసులు తెలిపారు. 4,473 మంది పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొంది. మృతదేహాల వెలికితీత కోసం 1,200 మంది అదనపు సైనిక సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతంలోని నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అన్నారు.
ఆపన్నహస్తం
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నేపాల్కు అత్యవసర సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. సంక్షోభ, మానవతా ప్రతి స్పందన నిపుణులను నేపాల్కు పంపుతున్నట్లు తెలిపారు. ఆహారం, అత్యవసర ఆశ్రయం, వైద్య సహాయంతో సహా మానవతా సహాయాన్ని కూడా అందిస్తున్నామని అల్బనీస్ వెల్లడించారు. ఆచూకీ లేని తమ దేశ పౌరుల క్షేమ సమాచారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్ బాధితులకు సానుభూతి కూడా తెలిపారు. నేపాల్‌లో విషాదంపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ విచారం వ్యక్తం చేశారు. సహాయక, పునర్నిర్మాణ ప్రయత్నాలకు తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా సంఘీభావం ప్రకటించాయి. అమెరికా 500,000 డాలర్ల సహాయాన్ని ప్రకటించగా, డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వైద్య సామగ్రిని పంపిస్తోంది.ఈ వరదల కారణంగా 93వేల మంది ప్రభావితమైనట్లు రెడ్ క్రాస్ లెక్క తేల్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు