Wednesday, February 18, 2026
Homeసాహిత్యంపతాక వందనం!!

పతాక వందనం!!

- Advertisement -

జయహో గణతంత్ర పతాక! జనప్రియ జాతి జాగత గీతిక!!
కేతన రెపరెపలు ప్రతీవాడలా స్వేచ్ఛస్వచ్ఛతల ప్రతీకలు
సు“తంత్రపు”మువ్వన్నెల రంగుల్లోంచి సంభ్రమ్మాలికలు!! అర్థవంతమైన స్వాతంత్య్రం కోసం పరితపించి అసువులు బాసిన త్యాగధనులెందరో కదా?! బానిసయుగాల పరదాశ్య శంఖలాల్నించి విడివడిన స్వతంత్రం గణతంత్రం ఫలాలు
నేటికీ దేశభక్తిజాతీయతల అస్తిత్వ మూలాలు ఆనాటి పోరాటాలు పోరుబావుటాలు వర్తమానం
చరిత్రగతి నిర్దేశనకు ఆలంబనలే కదా?!
I I I
లౌకిక భావనల నిర్మితుల రాజ్యాంగ నిర్దేశనంతో
శాసనాలుచట్టాలు నిజాచరణం ఆశయాలు
జాతిజాతీయతల భారతీయతకు నిదర్శనం మతాలుఅభిమతాలు భిన్నత్వాల్నించి
మనం నుంచి జనం భావనలు కొరవడ్తూంటే
పాలితులుపాలకుల నడుమ అంతరాలు అరా(జ)చకీయం దుర్నీతుల వ్యథలు తీరెదెన్నడు సమభావం న్యాయం ఆకాంక్షలు
అందని ద్రాక్షల్లా ఊరిస్తూనే ఉంటున్నాయి
సౌందర్యభారతంలోకి విస్తరిల్లేలా నింగీ నేలా నడుమ సమైక్యతాగీతాలు
కిరాయి పరాయి, పన్నాగాలకు రణన్నినాదాలు
నిజాయితీల సరిహద్దు భద్రతలకు జన ఘన నీరాజనాలు
అకళంక దేశభక్తుల కివే సాంజలి బంధనాలు!!
వి.ఎస్‌.ఆర్‌.ఎస్‌.సోమయాజులు, సెల్‌: 9441148158

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు