Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు..

పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు..

- Advertisement -

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్షలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో కూడిన మార్కులు కైవసం చేసుకోవడానికి యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా 600 మార్కులకు గాను 499 మార్కులు తమ స్టడీ మెటీరియల్ ద్వారా రావడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర నారాయణరెడ్డి, ధర్మవరం అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి వెంకట కిషోర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ఆరు సబ్జెక్టులలో ఆంగ్లం 78 మార్కులు, తెలుగు 82 మార్కులు, హిందీ 86 మార్కులు, సామాన్య శాస్త్రం (ఫిజికల్ అండ్ నాచురల్ సైన్స్) 76 మార్కులు గణితం 85 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 92 వెరసి 499 మార్కులు విద్యార్థులు కైవసం జరిగిందని తెలిపారు. గత 28 సంవత్సరాలుగా పదవ తరగతి చదివే విద్యార్థులకు నిష్ణాతులైన , అనుభవజ్ఞులైనఉపాధ్యాయులచే స్టడీ మెటీరియల్స్ ను తయారు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఇంతటి మార్కులు తేవడంలో స్టడీ మెటీరియల్ లో ప్రశ్నపత్రాలు తయారుచేసిన ఉపాధ్యాయులకు యుటిఎఫ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు కూడా యుటిఎఫ్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు