రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక ప్రాథమిక పాఠశాలలో (ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా) ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయ్ భాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినెల రెండవ ఆదివారం ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని పేద ప్రజల కొరకు నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, జిల్లా అండత్వ నివారణ సంస్థ పుట్టపర్తి, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో ఉచితకంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత ఆపరేషన్లు, ఉచిత వసతి, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డులతో రెండు జిరాక్స్ కాపీలు మూడు ఫోటోలు, సెల్ నెంబర్ తో రావలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బీపీ షుగర్ ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకుని తగ్గించుకున్న తర్వాత మాత్రమే రావాలని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి నారాయణప్ప జ్ఞాపకార్థం సతీమణి దాసరి బసమ్మ, కోడలు దాసరి లక్ష్మీదేవమ్మా, కుమారుడు దాసరి రామచంద్ర వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణ, గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, బి రామకృష్ణ, చోలి గాళ్ళ వెంకటేశులు, బీవీ చలం, గట్టు హరినాథ్, కే పెద్ద రెడ్డి, చంద్రశేఖర్, సుదర్శన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


