Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసత్యసాయి జిల్లా లో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

సత్యసాయి జిల్లా లో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

- Advertisement -

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు

విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ నాయకులు ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముసుకు మధు మాట్లాడుతూ.. ఎలినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి, నష్టాలను అంచనా వేయాలని కోరారు. జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, రైతులకు కరువు సహాయక చర్యలు అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు, సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ముసుకు మధు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా,పట్టణ నాయకులు ఆదినారాయణ, శ్రీనివాసులు,మరియు మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు