విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సి ఎన్ బి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ వారి డిస్టిక్ మెంబర్షిప్ సెమినార్ కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక జిల్లాల నుంచి రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ నుండి మానస నృత్య కళా కేంద్రం గురువు మానసకు ఆహ్వానం రాగా, వారు గురువుతో పాటు శిష్య బృందం శాన్వి స్వరూప్, భావన, సంధ్య శ్రీ, కావ్య శ్రీ వారు నిర్వహించిన ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తదుపరి రోటరీ క్లబ్ వారు గురువు మానసతోపాటు శిష్య బృందాన్ని కూడా సన్మానించి, ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. గురువు మానస మాట్లాడుతూ ఇటువంటి రోటరీ క్లబ్ కార్యక్రమానికి తాము పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ కూడా నాట్యం చేసిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన, నాట్య గురువు మానస
- Advertisement -
RELATED ARTICLES


