Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్థిక సాయం అందజేసిన పరిటాల శ్రీరామ్

ఆర్థిక సాయం అందజేసిన పరిటాల శ్రీరామ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో రెండు రోజుల కిందట వినాయక నిమజ్జనం సందర్భంగా,కదిరి గేటు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన చిన్నారి వర్షిత పార్థివ దేహాన్ని తెదేపా నాయకులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.పండుగ రోజున పేద కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం బాధాకరమని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తెదేపా నాయకులు ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అందజేసిన 30 వేల రూపాయలను వర్షిత తండ్రి అశోక్ కు తెదేపా నాయకులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు