Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆటో చార్జీల పెంపుపై ఐక్య యూనియన్ నాయకులు ధర్నా

ఆటో చార్జీల పెంపుపై ఐక్య యూనియన్ నాయకులు ధర్నా

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ వద్ద ఆటోల ఐక్య యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఆటో చార్జీల పెంపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూనియన్ నాయకులు తమ సమస్యలను వివరించారు.ధర్నా కారణంగా సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఐక్య యూనియన్ సంఘాల నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ పై కాలనీ నుంచి పట్టణంలోని దుర్గమ్మ గుడి వరకు దాదాపు 5.30 కిలోమీటర్ల దూరానికి మాత్రమే రూ.20 చార్జీ తీసుకుంటున్నామని తెలిపారు.ఈ మార్గం మినహా మిగిలిన ప్రాంతాల్లో గతంలో ఉన్న చార్జీలే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.వైఎస్సార్ పై కాలనీ నుంచి ఎర్రగుంట వరకు రూ.10,ఎర్రగుంట నుంచి దుర్గమ్మ గుడి వరకు రూ.10 చార్జీ మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు.దాదాపు 15 సంవత్సరాలుగా ఆటో చార్జీని రూ.10గానే తీసుకుంటున్నామని,కరోనా సమయంలోనూ ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చార్జీలు పెంచలేదన్నారు.దాదాపు ఆరేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పాత చార్జీలతోనే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.ఇటీవల నిత్యావసర సరుకుల ధరలు,పిల్లల పాఠశాల ఫీజులు పెరగడంతో పాటు ఆటోల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు,ఇంజిన్ ఆయిల్ తదితరాల ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఆటో డ్రైవర్ల ఆదాయం మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులు ఆటోలను వినియోగించడం తగ్గిందని తెలిపారు.ఆటో కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని కేవలం 5.30 కిలోమీటర్ల దూరానికి మాత్రమే రూ.20 చార్జీ తీసుకుంటున్న విషయాన్ని ప్రయాణికులు అర్థం చేసుకుని సహకరించాలని ఐక్య యూనియన్ సంఘాల నాయకులు,కార్మికులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు