Homeజిల్లాలుతూర్పు గోదావరిపీఎం కిసాన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి

పీఎం కిసాన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి

- Advertisement -

–మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్

విశాలాంధ్ర – కడియం : సొంత పొలం ఉండి, పీఎం కిసాన్ లబ్ధిదారుడైన ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కడియం మండలం లోని కడియం మరియు వేమగిరి గ్రామాలలో, కడియం మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 3971 మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 27 మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారని తెలిపారు. మిగిలిన 3944 మంది రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా గాని, మీసేవ కార్యాలయం నందు గాని, రైతు సేవా కేంద్రంలో గాని ఈకేవైసీ చేయించుకోవాలని, చేయించుకున్న రైతులు మాత్రమే తదుపరి విడత పిఎం కిసాన్ కు అర్హులవుతారని తెలిపారు. ఉద్యానశాఖాధికారి సుధీర్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ పరంగా అనేక రాయితీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విఏఏ ప్రత్యూష, నాగమణి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు