కరోనా వచ్చిన దగ్గర నుంచి చిన్నా, పెద్దా అంతా మొబైల్స్ వ్యసనానికి అలవాటుపడ్డారు. ఇక ఆన్‌లైన్‌లో ఎన్నో గేమ్స్ కూడా రావడం మొదలయ్యాయి. పిల్లలు వాటికి అలవాటుపడ్డారు. గతంలో బ్లూవేల్స్ అనే ఆన్‌లైన్ గేమ్ చాలా మంది పిల్లల మరణానికి కారణమయ్యింది. ఇప్ప్పుడు ప్రతీ చోటా కొరియన్ ఫీవర్ మొదలయ్యింది. కొరియన్ సీరియల్స్‌తో పాటు కొరియన్ గేమ్స్‌కి అలవాటుపడ్డారు. అలాంటి ఒక కొరియన్ లవ్Y పేరుతో వచ్చిన ఒక ఆన్‌లైన్ కారణంగా ముగ్గురు ఆడపిల్లల ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనం సష్టించింది. అసలు ఈ గేమ్ ఏంటంటే…
ఇదొక టాస్క్ బేస్డ్ ఆన్‌లైన్ గేమ్. ఇది ప్లేయర్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసుకుంటుంది. చిన్న పిల్లలు, టీనేజర్లు టార్గెట్‌గా ఈ గేమ్‌లు డిజైన్ చేస్తారు. మొదట్లో ఈ గేమ్ చాలా తేలిగ్గా ఉంటుంది. రోజూ ఒక టైమ్‌కే చాట్ చేయడం, రోజు ఎలా గడిచింది అంటూ ప్రేమ మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తుండాలి. ఇవి చిన్నచిన్న టాస్క్‌లే. ఎప్ప్పుడైతే ఈ మెసేజులు ఇచ్చేవాళ్ల మనస్తత్వం తెలుస్తుంది అప్ప్పుడు లెవెల్స్ మారుతూ ఉంటాయి. “నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ పని చెయ్యి లేదంటే నేను బాధపడతాను అంటూ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ మెసేజులు చేసి మానసిక ఒత్తిడిని పెంచేస్తారు. దీంతో పిల్లలు, యువత దీన్ని గేమ్‌లా భావించకుండా ఇదే జీవితం అని నిజమైన ప్రేమ అని భావించి అవతల వారి మెసేజ్ ప్రకారం ఒక రోబోలా నడుచుకుంటూ ఉంటారు. ఈ గేమ్ నెమ్మదిగా ప్రమాదకరంగా మారుతుంది. ఒంటరిగా ఉండమని చెప్పడం, కుటుంబానికి దూరంగా ఉండమని సలహాలు ఇస్తారు. దీంతో పిల్లలు మనసు కలుషితమైపోయి ఇంట్లో వాళ్ల మీద ప్రేమ, గౌరవం చూపించడం మర్చిపోయి వాళ్ల లోకంలో వాళ్లు ఒంటరిగా బతకడం మొదలుపెడతారు. అలాగని ప్రతి కొరియన్ గేమ్ ప్రమాదకరం కాదు. పిల్లల మనస్సు సున్నితమైనది. వాళ్లకు ప్రేమ, వాళ్ల మీద చూపించే ప్రత్యేక శ్రద్ద, అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరలో లేనప్ప్పుడు చేతిలో ఉన్న మొబైల్‌లో కనిపించే ప్రేమకు బానిసలైపోతున్నారు. గాజియాబాద్ ఘటన కూడా ఈ నేపథ్యంలో జరిగినదే. పిల్లల్ని కాపాడుకోవాలి అంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు మొబైల్ ఇవ్వడం తగ్గించాలి. ఒక వేళ్ల ఇచ్చినా ఏ గేమ్ ఆడుతున్నారు, దాని కంటెంట్ ఏంటో తెలుసుకోవాలి.
పిల్లలతో రోజూ మాట్లాడాలి, ప్రేమగా కబుర్లు చెప్పాలి. వాళ్లు చేసే పనులను మెచ్చుకోవాలి. అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, మౌనంగా మారటం వంటివి చూసినప్ప్పుడు సమస్యను తెలివిగా తెలుసుకోవాలి. స్కూల్స్ టీచర్లు కూడా పిల్లల్లో మార్పులు గమనించి పేరెంట్స్‌కు చెప్పాలి. ఆన్‌లైన్ ప్రేమ, బంధాల పేరుతో వచ్చే ఏ గేమ్ ఐనా ప్లాట్‌ఫారమ్ ఐనా సురక్షితం కాదనే విషయాన్ని తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను ఆన్‌లైన్‌లో పంచుకోవడం అంత సురక్షితం కాదు. అపరిచితులతో భావోద్వేగాలను ప్రమాదకరం. ఏదైనా అనుమానాస్పద డిజిటల్ గేమ్, అభ్యంతరకర చాట్ కానీ మీ కంట పడితే వెంటనే అప్రమత్తం అవ్వండి. డిజిటల్ ప్రపంచం ఎంత ఆకర్షణీయమైన మాయా ప్రపంచమో పిల్లలకు అర్ధమయ్యేలా వివరించండి. ముఖ్యంగా, పిల్లలకు మొబైల్ కంటే తల్లిదండ్రుల అనుబంధమే భద్రత అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
పిల్లల ప్రాణాలు తీస్తున్న కేఎల్‌జీతో జాగ్రత్త!
- Advertisement -


