Homeఅంతర్జాతీయంపీఓకే ప్రధాని ఇఫ్తిఖార్ గిలానీ

పీఓకే ప్రధాని ఇఫ్తిఖార్ గిలానీ

- Advertisement -

నవాజ్ షరీఫ్ ఓకే నేడు ఎన్నిక

లాోర్: పాకిస్థాన్ అధికార పార్టీ పీఎం‌ఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బారిస్టర్ ఇఫ్తిఖార్ గిలానీని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రధానమంత్రి పదవి కోసం నామినేట్ చేశారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత ఒకరు గురువారం తెలిపారు. పీఓకేలో జులై 27, ఆగస్టు 2, 3 తేదీల్లో మూడు దశల్లో శాసనసభ ఎన్నికలు హింస, రిగ్గింగ్ ఆరోపణల నడుమ వివాదాస్పదంగా జరిగాయి. నూతన ప్రధానిని శుక్రవారం ఎన్నుకోనున్నారు. తాను పోటీ చేసిన స్థానంలో ఓడిపోయిన గిలానీ ఆ తర్వాత టెక్నోక్రాట్ సీటు దక్కించుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఆయన పేరును నవాజ్ షీరఫ్ ఖరారు చేసినట్లు సీనియర్ నేత వెల్లడించారు. పీఓకే అసెంబ్లీలో 53 స్థానాలు ఉండగా, 45 మంది ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత పెద్దలకు రిజర్వు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు