Homeసాహిత్యంప్రజలతో నా ప్రయాణంసురవరం సుధాకర్ రెడ్డి

ప్రజలతో నా ప్రయాణంసురవరం సుధాకర్ రెడ్డి

- Advertisement -

A glamarous communist leader and a matured politician from Telangana

తాడి ప్రకాష్
1975, నవంబర్, మాస్కోలో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభ జరుగుతోంది. అప్పటికే సి.పి.ఐ. జాతీయ సమితి సభ్యులు సుధాకర్ రెడ్డి, డాంగే, చంద్ర రాజేశ్వరరావు, భూపేష్ గుప్తాలతో ఆ సభకు వెళ్ళారు. విరామ సమయంలో మూడో అంతస్తు లిఫ్ట్ దగ్గర ఉన్నారు. లిప్ట్ తెరుచుకుంది. అందులోంచి కమేండరన్ ఇన్ చీఫ్ ఫిడేల్ కాస్ట్రో బైటికి వచ్చారు. ఒక ప్లెజెంట్ సర్రైÎజ్. సుధాకర్ రెడ్డి ఉత్సాహంగా షేక్ హాండ్ ఇచ్చారు. కాస్రోట్‌కి హెవీ సెక్యూరిటీ ఉంటుంది. గార్డులు ఆయన చుట్టూ నిలబడ్డారు. కాస్ట్రో నవ్వుతూ వెళ్లి పోయారు. యూత్ ఫెస్టివల్ కు వెళ్లినప్పుడు, మాస్కో లోని ఒక హోటల్ లో తొలి అంతరిక్ష యాత్రికుడు యూరీ గగారిన్ని కలిశారు సుధాకర్ రెడ్డి. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ఆఫీసులో పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ ని సుధాకర్ కలుసుకుని చాలా సేపు మాట్లాడారు.
సుధాకర్ వియత్నాం వెళ్ళినప్పుడు నాటి వియత్నాం విదేశాంగ మంత్రి మదాంబిన్ ను కలిసి మాట్లాడారు. “వియత్నాం విప్లవ సరస్సులో వికసించిన అగ్ని పుష్పం బిన్” అని ఆమెని తలుచుకుంటారు. ఆమె జీవిత చరిత్ర ఇంగ్లీషు కాపీని సుధాకర్ రెడ్డికి బహూకరించింది.
పాకిస్తాన్ వెళ్ళినప్పుడు దక్షిణాసియా జర్నలిస్టుల సమావేశంలో, భయమెరుగని పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు శ్రీమతి ఆస్మాజహంగీర్ తో ఒక సదస్సులో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మతోన్మాదానికీ, మూఢ విశ్వాసాలకూ వ్యతిరేకంగా జరిగిన అనేక ప్రదర్శనలు, సభలకు ఆమె నాయకత్వం వహించింది. ఆమెపై అనేక హత్యాయత్నాలు జరిగాయి. ఆమెతో మాట్లాడడం ఒక గొప్ప జ్ఞాపకం అని సురవరం రాశారు.
ప్రపంచ దేశాల్లో పర్యటించి, ప్రజల కోసం పోరాడిన నాయకుల్ని, ఉద్యమకారుల్నీ, మేధావుల్నీ కలవడం ఆయనకొక మరిచిపోలేని జీవితానుభవం.
సుధాకర్ రెడ్డి జీవిత కథ పుస్తకం ‘ప్రజలతో నా ప్రయాణం’ 2026 మార్చిలో వచ్చింది. అరెస్టులు, పోరాటాలు, ఉద్యమాలు.. అప్పటి నాయకుల గురించి చక్కని తెలుగులో, నిరాడంబరమైన శైలిలో సురవరం రాశారు. ఆయన సహచరి బి. విజయలక్ష్మీ అడిగినందువల్ల, నేను ఆ పుస్తకాన్ని ఎడిట్ చేసి, డిజైనింగ్ లో మాట సాయం చేశాను. సుధాకర్ రెడ్డి, ఆర్‌టిస్ట్ మోహన్ మంచి మిత్రులు అవడం వల్ల, ఆయన నాకు బాగానే తెలుసు. 1974-75 సంవత్సరాల్లో ఆయన విజయవాడ ‘విశాలాంధ్ర’ ఆఫీసుకు వచ్చినప్పుడు మొదటి సారి చూశాను. ఖద్దరు పంచెలు, తెల్ల చొక్కాల్లో రైతు నాయకుల్లా ఉండే పార్టీ నాయకుల్ని చూసిన నాకు, మోడర్న్ గా టక్ చేసుకుని, అందంగా మెరిసే నవ్వుతో పలకరించే మోస్ట్ గ్లామరస్ సుధాకర్ రెడ్డిని చూడడం ఎంతో బావుండేది. పైగా ఆయన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని పలకరిస్తారు. “మోహన్, అప్పుడు మనకి ఏలూరు పార్టీ ఆఫీసులో టీ ఇచ్చి కబుర్లు చెప్పిన కుర్రాడు గుర్తున్నాడా? ఆ కామ్రేడ్ ఎలా ఉన్నాడిప్పుడు?” అని 40 ఏళ్ళ నాటి సంగతి సుధాకర్ అడిగినపుడు ఆశ్చర్యపోయానని మోహన్ ఒకసారి నాతో అన్నాడు.
చాలా ఏళ్ళ క్రితం గోరటి వెంకన్న వచ్చి, సురవరం ఇంటికి వెళ్దామా? నా కొత్త పుస్తకం ఆయనికివ్వాలి అన్నాడు. ఫోన్ చేస్తే ఆయన రమ్మన్నారు. హైదరాబాద్ లోని శంకర్ మఠ్ దగ్గర్లోని ఆయనింటికి వెళ్ళాం. సురవరం ట్రేడ్ మార్క్ నవ్వుతో పలకరించి, కబుర్లు చెప్పారు. భక్ష±యూలు తిందాం రండి అన్నారు విజయలక్ష్మీ గారు. కోస్తా వాళ్ళు బొబ్బట్లు అనే భక్ష±యూల్లో వేడిపాలు పోసి తినడం ఇక్కడి అలవాటు. రుచిగా ఉన్నాయి. అలా తినడం అదే మొదటి సారి. అప్పుడే తెలిసింది గోరటి, సురవరం మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళని. పార్టీ ఊరేగింపులు, సభలూ, ధర్నాలు, బంద్లూ, అరెస్టులూ… ఎంత ఊపిరి సలపని పని ఉన్నా తెలుగు సాహిత్యం చదివి ఎంజాయ్ చేయడం సుధాకర్ రెడ్డికి ఇష్టమైన పని.
1968లో బెంగాల్ వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసినందుకు నిరసనగా, కలకత్తాలో రోజూ ప్రదర్శనలు జరిగేవి. సుధాకర్, స్టాలిన్ బాబూ, ఆర్‌టిస్ట్ మోహన్ మరో అయిదుగురు ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్ళారు. వేల మంది విద్యార్థుల ప్రదర్శన మీద లాఠీ చార్జి, కాల్పులు… బీభత్సంగా జరిగింది. ఇద్దరు చనిపోయారు. 150 మందిని అరెస్టు చేసి ప్రెసిడెన్సీ జైల్లో పెట్టారు. అక్కడే సుధాకర్ రెడ్డి, మోహన్ మంచి స్నేహితులయ్యారు. ప్రెసిడెన్సీ జైలు గోడల మీద మోహన్ బొగ్గుతో వేసిన లెనిన్, మార్క్స్ , చేగువెరా బొమ్మలు అక్కడి వారికి బాగా నచ్చాయి.
బ్యాంక్ ఉద్యోగం చేస్తూ, ఇద్దరు అబ్బాయిల చదువు సంధ్య చూసుకుంటూ, మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తూ, ఎప్పుడూ పనిఒత్తిడిలో ఉండే సుధాకర్ రెడ్డి కి అటెండ్ అవుతూ, ఊరేగింపులకు ఆడవాళ్ళను పోగు చేస్తూ, దీక్షతో క్రమశిక్షణతో విజయ లక్ష్మీగారు చేసిన శతావధానాన్ని కొన్ని దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నాను. మా ఆవిడ నళిని, ఆమె, ప్రేమ పావని ఏళ్ళ తరబడి కలిసి పనిచేసిన సహచరులు. నళిని హ్యాండ్ బ్యాగ్‌లో ఎండిన ఉసిరికాయ ముక్కలు ఎప్పుడూ ఉంటాయి. “నళిని కాసిని ఉసిరి కాయ ముక్కలు ఇవ్వమ్మా” అని అడిగి తీసుకునే వారు సుధాకర్ రెడ్డి.
ఎప్పుడూ కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల గుప్పెట్‌లో ఉండే సి.పి.ఐ. నాయకత్వం, తెలంగాణా లీడర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి చేతిలోకి రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. హుందాగా, సంస్కారవంతంగా ఉండే సురవరాన్‌ని జైపాల్ రెడ్డి నుంచి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి దాకా, అజీజ్ పాషా నుంచి పూల సుబ్బయ్య, ధర్మ భిక్షం దాకా నాయకులంతా గౌరవించి, అభిమానించేవారు. తెలంగాణా ఉద్యమం కెరటాలై ఎగిసిపడుతున్న కాలంలో, చెయ్యి దాటిపోతోంది, ప్రత్యేక తెలంగాణా ఇచ్చి తీరాలి అని సోనియా గాంధీకి నచ్చ చెప్పిన వాళ్ళలో సుధాకర్ రెడ్డి ఒకరు.
నిరంతర అధ్యయనం ఆయన ప్రత్యేకత. ఇంగ్లీషులో, తెలుగులో వ్యాసాలు రాయగల ప్రతిభావంతుడు. జనాన్ని కట్టిపడేసేలా ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్ట. పదునైన వాదనతో, తిరుగులేని తర్కంతో ఒక గంభీరమైన ప్రవాహంలా ఆయన ప్రసంగం సాగుతుంది. సుదాకర్ రెడ్డి చాలా అల్లరి చేస్తాడని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సాయంకాలం పార్టీల్లో ఆయన కబుర్లు విని తీరాలి. ఓ సారి, సుధాకర్ మంగోలియా వెళ్ళినపుడు, రాజధాని ఉలన్ బటార్‌లో మిత్రులతో కాలక్షేపం చేస్తున్నారు. అది చాలా సువిశాలమైన దేశం. జనం మాత్రం బాగా తక్కువ.
మీ దేశ జనాభా ఎంత? అని అడిగితే, వాళ్ళు.. జనాభా 30 లక్షలు, జంతువులు పదికోట్లు అని సరదాగా చెప్పారట.
సుధాకర్ రెడ్డి చివరి సంవత్సరాల్లో ఆకీస్జన్ ట్యూబు పెట్టుకుని, సత్తువలేక నీరసంగా ఉన్నప్పుడు కూడా, నా ‘ఏలూరు రోడ్డు ఆత్మగీతం’ చదివి, సమీక్ష రాసి పంపించారు. చాలా బ్యూటిఫుల్, సెన్సిబుల్ రివ్యూ. రెండు సార్లు లోక్ సభ సభ్యునిగా గెలిచిన ఆయనకి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో, అక్కడి పేద జనంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంపీలూ, ఎమ్మెల్యేలూ అంటూ ఎన్నికల రాజకీయాల్లో కూరుకుపోయిన కమ్యూనిస్టు పార్టీ మునుపటి బలాన్నీ, ఆకర్షణనూ పోగొట్టుకుంది. డబ్బు రాజకీయాలు పార్టీకి శాపంగా మారాయి. దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవాన్నీ, వైభవాన్నీ, పార్టీ ఎయిర్ కండీషన్¦ భవంతులకు పరిమితమై పోయిన విషాదాన్నీ చూసిన నాయకుడాయన.
జీవిత కథ పుస్తకంలో, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, జయశంకర్, కెసీయార్, సుందరయ్య, జ్యోతిబసు, గంగాధర్ అధికారి, చంద్ర రాజేశ్వరరావు లాంటి వాళ్ళ గురించి హృద్యంగా చెప్పిన సుధాకర్ రెడ్డి, ఎవర్నీ హర్ట్ చేయడం ఇష్టం లేక… అన్నీ నిజాలే రాసినా, సరళంగా నిజాయితీగా రాసినా, మరెన్నో నిజాలను దాచారు. రాయకుండా జాగ్రత్త పడ్డారు. భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శిగా, చాలా ఏళ్ళు కల్లోల రాజకీయాలతో కలిసి నడిచిన నాయకుడికి సహజంగానే కొన్ని పరిమితులు ఉంటాయి. శక్తి కోల్పోయి, బలహీనపడిపోయిన పార్టీకి ఇతరుల్లో, సొంత లేదా, ఇతర పార్టీల్లో తప్పులు కనిపెట్టి, విమర్శించడం, లేదా తిట్టడం భావ్యం కాదని సుధాకర్ రెడ్డి అనుకున్నారేమో?
9704541559

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు