Homeకరవు సీమలో జల సవ్వడి

కరవు సీమలో జల సవ్వడి

- Advertisement -

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కొండల్ని చీల్చుకుంటూ నల్లమలసాగర్‌కు కృష్ణా జలాల పరుగు

తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు
4 లక్షల మందికి తాగునీరు

విశాలాంధ్ర – పెద్ద దోర్నాల: మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జల హారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కరవునేలను తాకిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆకిÇడెకుట్‌కు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. నల్లమల కొండలను చీల్చుకుని కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర జలాలను సీఎం… మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులపై స్వయంగా చల్లారు. అకిÇడెకుట్ వద్ద రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్విచ్ నొక్కి జలాలను దిగువకు వదిలారు. 30 ఏళ్ల క్రితం తానే భూమిపూజ చేయడం..నేడు తానే వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవ చేయడం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. “ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం. కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం. శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. మార్కాపురం చెన్న కేశవుడు కొలువైన నేలకు జలహారతి ఇస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకుని జల సిరులతో ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడిగాం. వెలిగొండ బంగారు కొండ అవుతుంది. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మాట ఇచ్చాం.. ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణమ్మను తరలించాం. ఇక సంపద సృష్టిస్తాం. మార్కాపురం గడ్డకు, కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలు భరించిన కుటుంబాలకు, నీటి కోసం ఎదురు చూసి అలసిపోయిన తరాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి ఇస్తున్నాం.”అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నిర్వాసితుల త్యాగాలకు పాద్ఙాóవందనం
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాద్ఙాóవందనం చేస్తున్నానని సీఎం అన్నారు. రైతుల త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. “ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేవారు ఎంత సంతోషంగా ఉంటారో.. నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వాసితుల బాధలు, అవసరాలను గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించామన్నారు. రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశామని, తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. వెలిగొండ రెండో దశ కూడా పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని సీఎం వివరించారు. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు. కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర.” అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే గొడ్డలిపార్టీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితంచేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు.
మార్కాపురంలోనూ 2028 కృష్ణా పుష్కరాలు
వెలిగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ఫేజ్-2ను కూడా 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు చేశామని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌లో మార్కాపురాన్ని భాగం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే ఎన్‌డీఏ విధానమని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తరలిస్తున్నామని, తదుపరి వంశధార వరకూ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం జరగాలని, మహానది-గంగానదులను అనుసంధానిస్తే దేశం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని చెప్పారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలు నల్లమల సాగర్ వరకూ రావాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నామన్నారు. అలాగే తాము ఏ పని చేసినా ఎన్నికల కోసం కాదు.. ప్రజల జీవితాలను మార్చేందుకు, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.సంప్రదాయ పంచెకట్టుతో ఉల్లాసంగా తెలుగు సంప్రదాయ పంచె కట్టుతో బహిరంగ సభా వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంపుపై కండువా తిప్పుతూ రైతులకు, ప్రజలకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు పనిచేసిన అధికారులు, ఉద్యోగాలు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి. నారాయణ, కందుల దుర్గేష్, కొలుసు పారÆసారధి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇంచార్జి గూడూరీ ఎరీక్షన్ బాబు, సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు