బాలికపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: దిల్లీలో మరోసారి నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి జిల్లాకు చెందిన బాధిత బాలిక… 11వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదని తల్లి తిట్టడంతో ఆగస్టు 4న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నోయిడాలో ఉన్న తన బంధువును కలిసేందుకు బయల్దేరింది. అయితే భారీ వర్షం కారణంగా గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ ప్రాంతంలో ఆగిపోవాల్సి వచ్చింది. అప్పుడే అటువైపు నుంచి ఒక స్లీపర్ బస్సు వెళ్తుండటంతో… దాన్ని ఆపింది. అందులో ప్రయా ణికులు ఎవరూ లేరు. కానీ డ్రైవర్, కండక్టర్ ఆమెకు మాయమాటలు చెప్పి ఎక్కించుకు న్నారు. బాలికను బెదిరించి కండక్టర్, డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి… కశ్మీరీ గేట్ ఐఎస్బీటీ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద వదిలేశారు. అనంతరం ఆ బాలిక సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం బస్సును సీజ్ చేశారు. మరమ్మతు చేయించుకొని తిరిగి వస్తుండటంతో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు.


